Fact Check : చాక్లెట్‌లో బీఫ్‌.? నెట్‌లో జోరుగా ప్రచారం.. ఇదీ అసలు విషయం

20 Jul, 2021 14:09 IST|Sakshi

Cadbury Beef Controversy: ‘మంచిని ఆశిద్దాం తియ్యని వేడుక చేసుకుందాం' అంటూ అలరించే క్యాడ్‌ బరి చాక్లెట్‌ యాడ్‌ గురించి మనందరికి తెలిసిందే. ఆ యాడ్‌ చూసిన వారెవరైనా వెంటనే ఆ చాక్లెట్‌ కొనుక్కొని తినేయాలనే అనుకుంటారు. అందుకే ఆ చాక్లెట్‌ అంటే ఇష్టపడని వారుండరు. బాధైనా, సంతోషమైనా ఆ చాక్లెట్‌ తింటూ ఆ ఫీలింగ్‌ను షేర్‌ చేసుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఇంత పాపులర్‌ అయిన ఈ చాక్లెట్‌ను భారత్‌లో బ్యాన్‌ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం క్యాడ్‌బరీని జంతువుల నుంచి సేకరించిన జెలటిన్‌​ అనే ప్రొటీన్‌తో తయారు చేస్తున్నరంటూ కొన్ని వార్తలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ‍్యాయి. 

దీంతో పలువురు నెటిజన్లు యూకే క్యాడ్‌ బరీ సంస్థపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే నిజమైతే హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను తినిపించినందుకు క్యాడ్‌ బరీపై కేసు పెట్టాలని ట్వీట్‌ చేశారు. బ్రిటిష్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టారు. దీంతో ఈ వివాదంపై క్యాడ్‌బరీ.. ఆకు పచ్చ చుక్క గుర్తును ఉటంకిస్తూ క్లారిటీ ఇచ్చింది. మాండెలెజ్ / క్యాడ్‌బరీ ఉత్పత్తులు ప్యూర్‌ వెజిటేరియన్ అని తెలిపింది. అంతేకాదు క్యాడ్‌ బరీ చాక్లెట్‌ ర్యాపర్‌ పై ఉన్న ఆకు పచ్చ గుర్తు వెజిటేరియన్‌ అన్న విషయాన్ని సూచిస్తుందంటూ క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది.  

చదవండి : మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

మరిన్ని వార్తలు