క్రిప్టోకరెన్సీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంచలన వ్యాఖ్యలు..!

19 Apr, 2022 13:02 IST|Sakshi

క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోకరెన్సీలు అన్నిదేశాలకు అతిపెద్ద ప్రమాదంగా తయారయ్యే అవకాశం ఉందని అన్నారు. క్రిప్టోకరెన్సీలతో మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్‌ను సమీకరించేందుకు ఉపయోగపడతాయని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) స్ప్రింగ్ మీట్ సందర్భంగా జరిగిన సెమినార్‌లో నిర్మలా సీతారామన్‌ క్రిప్టోకరెన్సీలపై ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలతో అన్ని దేశాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. వీటితో మనీలాండరింగ్‌, తీవ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.  క్రిప్టో లాంటి డిజిటల్‌ కరెన్సీలపై టెక్నాలజీ సహాయంతో నియంత్రించాలని అభిప్రాయపడ్డారు. అన్ని దేశాలు, ఐఎంఎఫ్‌ సమన్వయంతో క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ చేయాలని వెల్లడించారు.

ప్రపంచబ్యాంక్‌, జీ20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ మీటింగ్‌లో నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా ఐఎంఎఫ్‌ నిర్వహించిన"మనీ ఎట్ ఎ క్రాస్‌రోడ్" అనే అంశంపై ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో  సీతారామన్‌ క్రిప్టోకరెన్సీలపై మాట్లాడారు. దాంతో పాటుగా డిజటల్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు భారత్‌ తీసుకున్న నిర్ణయాలను సీతారామన్‌ సమావేశంలో హైలైట్‌ చేశారు. 

చదవండి: వేతన జీవులకు శుభవార్తను అందించనున్న కేంద్రం..! 75 లక్షల ఉద్యోగులకు లబ్ధి..!


 

మరిన్ని వార్తలు