Moon Rover Motorcycle: చంద్రుడిపై నడిచే బైక్‌...! ఓ లుక్కేయండి...!

10 Oct, 2021 16:09 IST|Sakshi
ఫోటో కర్టసీ: Bikeexif

చంద్రుడిపై తొలి మానవసహిత యాత్రను 1959లో సెప్టెంబర్‌ 13న విజయవంతంగా అపోలో 11 వ్యోమనౌక ద్వారా అమెరికా ప్రయోగించిన విషయం తెలిసిందే. మరోసారి చంద్ర గ్రహంపైకి  మానవులను పంపే యోచనలో నాసా ఉంది.  

చంద్రుడిపై నడిచే బైక్‌...!
ఆర్టిమెస్‌ మిషన్‌ ద్వారా నాసా చంద్రుడిపైకి 2024లో మానవ సహిత యాత్ర చేసే యోచనలో ఉంది. అయితే అక్కడ పరిస్థితులకు అనుకూలంగా చంద్రుడిపై పలు రోవర్లను, మోటార్‌ బైక్లను తయారుచేసే పనిలో నాసా నిమగ్నమైంది. చంద్రుడిపై వ్యోమగాములు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్లడం కోసం పలు కాన్సెప్ట్‌లపై నాసా పనిచేస్తోంది. 

గత ఏడాది రష్యాకు చెందిన డిజైనర్‌ ఆండ్రూ ఫాబిషేవ్స్కీ సాధారణ రోవర్ డిజైన్‌ల మాదిరిగా కాకుండా చాలా వరకు బైక్‌ లాగా ఉండే  చంద్ర రోవర్ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చారు. తాజాగా ఈ డిజైన్లకు ప్రాణం పోస్తూ హుకీకో బైక్‌ రోవర్‌ను నిర్మించింది. మాస్కోకు చెందిన శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. దీనిని లాస్‌ ఎంజిల్స్‌లోని పీటర్సన్‌ మ్యూజియంలో త్వరలోనే ప్రదర్శించనున్నారు. 
చదవండి: టయోటా మరో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..!

ఆటోడెస్క్‌ ఫ్యూజన్‌ 360 సహాయంతో ఆండ్రూ డిజైన్‌లో పలు మార్పులు చేస్తూ హుకీకో వ్యవస్థాపకుడు నికో ముల్లర్‌ రూపోందించామని పేర్కొన్నారు. ఈ బైక్‌కు టార్డిగ్రేడ్‌గా నామకరణం చేశారు. 

థర్మోప్లాస్టిక్‌ పాలియురేతేన్‌ తో టైర్లను రూపొందించారు. ఈ బైక్‌లో అల్యూమినియం ట్రాసెస్‌ను వాడారు. చంద్రుడిపై ఉన్న గురుత్వాకర్షణకు తగ్గట్టుగా ఈ బైక్‌ను డిజైన్‌ చేసినట్లు నికోముల్లర్‌ పేర్కొన్నారు. ఈ బైక్‌ను ఆర్టిమెస్‌ మిషన్‌లో నాసా వాడుతోందా...లేదా అనే విషయంపై ఇంకా తెలియాల్సి ఉంది.


చదవండి: గ్రీన్‌ ఎనర్జీ దిశగా రిలయన్స్‌..! విదేశీ కంపెనీను కొనుగోలుచేసిన రిలయన్స్‌..!

>
మరిన్ని వార్తలు