క్రిప్టోకరెన్సీపై నరేంద్ర మోదీ కీలక నిర్ణయం, దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా?

25 Nov, 2021 20:38 IST|Sakshi

త్వరలో కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకూ పార్లమెంటు సీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్బీఐ ఆందోళనకు అనుగుణంగా దేశంలో ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలపై బ్యాన్‌ విధించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ పలుమార్లు క్రిప్టో కరెన్సీ వల్ల దేశ ఫైనాన్షియల్, ఆర్థిక స్థిరత్వాలకు విఘాతం కలుగుతుందనే విషయాన్ని స్పష్టం చేయగా, ఇదే అంశంపై ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రిప్టో కరెన్సీని నిషేదం విధించేలా ప్రధాని నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే క్రిప్టో కరెన్సీ బ్యాన్‌ పై భారతీయుల అభిప్రాయం ఎలా ఉందో' తెలుసుకునేందుకు పలు సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.    

342జిల్లాల్లో సర్వే
దేశంలోని 342 జిల్లాలలో డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ క్రిప్టో కరెన్సీపై ప్రజల అభిప్రాయాల్ని సేకరించింది. ఈ సర్వేలో 56వేల మందికి పైగా పాల్గొన్నారని లోకల్ సర్కిల్స్ తెలిపింది. ఇండియా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 54 శాతం మంది దేశంలో క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధం చేయడానికి ఇష్టపడడం లేదు. అయితే అందుకు బదులుగా విదేశాలలో డిజిటల్ ఆస్తులుగా పరిగణించాలని కోరుతున్నట్లు లోకల్ సర్కిల్స్ తన నివేదికలో పేర్కొంది.

మనదేశంలో క్రిప్టోకరెన్సీలను ఎలా నిర్వహించాలనే ప్రశ్నకు 8,717 ప్రతిస్పందనలు వచ్చాయి. వారిలో 26 శాతం మంది ఈ కరెన్సీలను చట్టబద్ధం చేసి, భారతదేశంలో పన్ను విధించాలని చెప్పారు. అయితే  54 శాతం మంది మాత్రం చట్టబద‍్దత చేయకూడదని, 20శాతం మంది మాత్రం భారత్‌ మినహయించి ఇతర దేశాల మాదిరిగానే డిజిటల్ ఆస్తిలా పరిగణించి, వాటిపై పన్ను విధించాలని అన్నారు.

సర్వే ప్రకారం 87 శాతం మంది భారతీయలు క్రిప్టోకరెన్సీలలో వ్యాపారం, లేదా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టం పడడం లేదని తేలింది. క్రిప్టోకరెన్సీ ప్రకటనలపై ప్రశ్నించగా 9,942 స్పందించారు.  ఇందులో 74 శాతం మంది క్రిప్టోకరెన్సీ వచ్చే ప్రకటనలు ఆకర్షిస్తున్నాయని, కానీ నష్టాలు హైలెట్‌ చేయకపోవడాన్ని ప్రస్తావించారు.  
 

మరిన్ని వార్తలు