9 లక్షల వాహనాలు తుక్కుకే: నితిన్‌ గడ్కరీ

31 Jan, 2023 09:12 IST|Sakshi

కాలం చెల్లిన వాహనాలను వదిలించుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఏప్రిల్‌ 1 నుంచి ఆ వాహనాలు రోడ్లపై తిరగకుండా అనుమతుల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ ఘడ్కరీ అధికారిక ప్రకటన చేశారు. 

పరిశ్రమల సంస్థ ఫిక్కీ (fcci) నిర్వహించిన కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ‍్కరీ మాట్లాడుతూ..పర్యావరణానికి హానికలిగించే వాహనాల్ని స్క్రాప్‌గా మార్చనున్నట్లు తెలిపారు.  

ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్టీసీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 15 ఏళ్లు దాటిన 9 లక్షలకు పైగా కార్లు, బస్సులు తదితర వాహనాలను ఏప్రిల్‌ 1 నుంచి రోడ్డెక్కబోవు. రిజిస్ట్రేషన్‌ రద్దు చేసి వాటన్నింటినీ తుక్కు కింద మార్చేస్తామని అన్నారు. వాటిని పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలతో కూడిన కొత్త వాహనాలను భర్తీ చేస్తామన్నారు. అయితే రక్షణ, సైనిక వాహనాలు, ప్రత్యేక వాహనాలు తదితరాలకు ఇది వర్తించబోదన్నారు. 
 

మరిన్ని వార్తలు