దశాబ్దంలోనే భారత్‌లో ఎంతో మార్పు

1 Jun, 2023 03:15 IST|Sakshi

అంతర్జాతీయంగా స్థానం బలోపేతం

మోర్గాన్‌ స్టాన్లీ సానుకూల నివేదిక

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కింద భారత్‌ పదేళ్లలోనే ఎంతో మార్పు చెందినట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్‌ తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని, ఆసియా, ప్రపంచ వృద్ధిని నడిపించే కీలక దేశంగా అవతరించినట్టు తన తాజా నివేదికలో ప్రస్తావించింది. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్‍ క్వీన్‌, ఆ నిర్మాత ఇంటిపక్కనే!)

భారత్‌ తన సామర్థ్యాల మేరకు ఫలితాలను చూపించలేదని, ఈక్విటీ వ్యాల్యూషన్లు గరిష్టాల్లో ఉన్నాయన్న విమర్శలను తోసిపుచ్చింది. ఈ తరహా దృక్పథం గత తొమ్మిదేళ్లలో చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణలను విస్మరించడమేన పేర్కొంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థకు తోడు, గత 25 ఏళ్లలో గొప్ప పనితీరు చూపిన స్టాక్‌ మార్కెట్‌ను నిదర్శనాలుగా ప్రస్తావించింది. 2013తో పోలిస్తే ఇప్పుడున్న భారత్‌ భిన్నమైనదిగా పేర్కొంది. (సెబీ షాక్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు)

ఇవీ మార్పులు..: 2014లో ప్రధానిగా మోదీ కొలువుదీరిన తర్వాత చోటు చేసుకున్న పది పెద్ద మార్పులను మోర్గాన్‌ స్టాన్లీ ప్రస్తావించింది. పోటీ దేశాల స్థాయిలో కార్పొరేటు పన్నును తగ్గింపు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం  అతిపెద్ద సంస్కరణలుగా పేర్కొంది. జీఎస్‌టీ కింద పన్నుల ఆదాయం క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. అలాగే, జీడీపీలో డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతుండం ఆర్థిక వ్యవస్థ మరింత క్రమబద్ధీకరణ చెందుతుందనడానికి నిదర్శంగా పేర్కొంది. ఎగుమతుల్లో భారత్‌ వాటా రెట్టింపై 2031 నాటికి 4.5%కి చేరుకుంటుందని అంచనా వేసింది.   

తలసరి ఆదాయంలో వృద్ధి
ప్రస్తుతం భారత్‌లో తలసరి ఆదాయం 2,200 డాలర్లుగా (రూ.1,80,400) ఉంటే, 2032 నాటికి 5,200 డాలర్లకు (రూ.4,26,400) పెరుగుతుందని మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో  పేర్కొంది. ఇది బారత్‌లో వినియోగ పరంగా పెద్ద మార్పునకు కారణమవుతుందని అంచనా వేసింది.

మరిన్ని బిజినెస్‌వార్తలు,ఎకానమీ గురించిన  వార్తల  కోసం చదవండి సాక్షిబిజినెస్‌

మరిన్ని వార్తలు