పేరుకు సెకండ్‌ హ్యాండ్‌ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్‌ ఇవే..!

28 Dec, 2021 16:49 IST|Sakshi

కారు కొనాలనే కోరిక అందరికీ ఉంటుంది. కుటుంబంతో కారులో షికారు చేయాలని ఎంతో  మంది కల. బడ్జెట్‌ రేంజ్‌ కారు కొనేందుకు చాలా మంది​ ప్రయత్నాలను చేస్తుంటారు. కొంతమంది లోన్‌ తీసుకోనైనా  కారును సొంతం చేసుకుంటారు. కొత్తమందికీ బడ్జెట్‌ అడ్జెట్స్‌ కాకపోవడంతో సెకండ్‌ హ్యాండ్‌ కారువైపు మళ్లుతారు. ఇలా పాత కార్లను కొనుగోలు చేసి వారి సొంత వాహన కలను నేరవేర్చుకుంటారు. పాత కార్లను విక్రయించేందుకు ఇప్పటికే పలు కంపెనీలు అవతరించాయి. ఈ కంపెనీలు నమ్మకమైనవిగా నిలుస్తూ ఆయా వాహన కొనుగోలుదారులకు కార్లను అందిస్తున్నాయి. 

పేరుకు సెకండ్‌ హ్యాండే..!
పేరుకు సెకండ్‌ హ్యాండే కార్లేఐనా భారత్‌లో మారుతీ, హ్యుందాయ్‌, హోండా కార్లు అత్యధిక డిమాండ్‌ ఉన్న కార్‌ బ్రాండ్స్‌గా ఉన్నాయని కార్ల రిటైలింగ్‌ ప్లాట్‌ఫాం స్పిన్నీ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2021లో సుమారు 57 శాతం పైగా అమ్మకాలు జరిగాయని తెలిపింది. పీ అండ్‌ ఎస్‌ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం...స్పిన్నీ ఈ ఏడాది అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. . అగ్రగామి ఫుల్-స్టాక్ కార్ రిటైల్ ప్లాట్‌ఫారమ్ వాహనాలను ఆస్వాదిస్తున్న నగరాల్లో బెంగళూరు కేవలం  కొనుగోలుదారులలో 64 శాతం పెరుగుదలను అందించింది. తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్ గణనీయమైన అమ్మకాలు జరిగినటుల​ కంపెనీ పేర్కొంది. 


 

స్పిన్ని ప్రస్థానం
యూజ్‌డ్‌ కారు రిటైలింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌గా మార్కెట్‌లోకి ఎంటరైన అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది స్పిన్ని. ఇటీవల ఈ సిరీస్‌ ఈ ఫండింగ్‌ రౌండ్‌లో స్పిన్ని సంస్థలోకి 238 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు 530 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది స్పిన్ని. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ వ్యాల్యుయేన్‌ 1.80 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 

చదవండి: భలే స్కూటర్‌.. మడత పెట్టి బ్యాగులో పెట్టేయోచ్చు!

మరిన్ని వార్తలు