మాటలన్నీ ఎమోజీలుగా మారిపోతాయా?

16 Jul, 2021 13:26 IST|Sakshi

ప్రేమ..సంతోషం, అసూయ..బాధ ఇలా ఎన్నో భావాల్ని ఒక్క ఎమోజీతో చెప్పొచ్చు. మాట్లాడే అవసరం లేకుండా భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో బాగా పాపులర్‌ అయ్యింది. అందుకే ప్రతి ఏడాది జులై 17న వరల్డ్‌ ఎమోజీడేని జరుపుకుంటాము.ఈ సందర్భంగా ఎమోజీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.  
అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ 'బంబుల్' వరల్డ్‌ ఎమోజీ సందర్భంగా ఏ ఎమో​జీని ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కరోనా కారణంగా ఎమోజీల వినియోగం 2020 నుంచి 2021 మధ్యకాలంలో 86శాతానికి పెరగడంతో పాటు సోషల్‌ మీడియా, డేటింగ్‌ సైట్లలో యాక్టీవ్‌ గా ఉన్నట్లు నిర్ధారించింది. ఇక ఇండియన్స్‌కు చెందిన మిలీనియల్స్‌!! (దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉన్నయువత)  క్లాసిక్‌ రెడ్‌ హార్ట్‌ ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ఎమోజీల్లో టాప్‌ 5లో ఉంది. రెడ్‌ హార్ట్‌, కన్నుగీటేది, కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, సన్‌ గ్లాసెస్‌ ఎమోజీ, కళ్లతో నవ‍్వే స్మైల్‌ని వినియోగిస‍్తున్నారు. సోషల్‌ మీడియా ప్రొఫైళ్లలో నెటిజన్లు రెడ్‌ హార్ట్‌ ఎమోజీని వినియోగిస్తున్నారని బంబుల్‌ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సమర్పిత సమద్దర్ తెలిపారు.  

ఎమోజీ ఎలా పుట్టుకొచ్చింది.
తొలిసారి ఎమోజీని అమెరికా 16వ అధ‍్యక్షుడు అబ్రహం లింకన్‌ ప్రసంగంతో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 1862లో లింకన్‌ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల ఆహభావాలు అభిమానుల్ని అలరించాయి. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లో కన్నుగీటేది బాగా పాపులర్‌ అయ్యింది. నాడు పలుమీడియా సంస్థలు పేపర్లలో ఆయన ప్రసంగం పక్కనే కన్ను గీటే  ఎమోజీల్ని పెట్టారు. అలా ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు.

భవిష్యత్‌లో ఎమోజీలు ఇలా ఉంటాయా?
బంబుల్‌ నివేదిక ప్రకారం ఎమోజీల వినియోగం ఎక్కువగా ఉండడంతో.. ఆయా కంపెనీలు యూజర్లను అట్రాక్ట్‌ చేసేలా వాయిస్‌ను సెండ్‌ చేస్తే దానికి తగ్గట్లు డీఫాల్ట్‌గా ఎమోజీ రెడీ అయ్యేలా డిజైన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

చదవండి:  పిల్లల కోసం నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఫీచర్లు, ఖర్చు లేకుండా చూడొచ్చు!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు