పెరిగిన మదర్‌డెయిరీ పాల ధరలు..రేపట్నుంచి అమల్లోకి

20 Nov, 2022 18:55 IST|Sakshi

ప్రముఖ పాలపంపిణీ సంస్థ మదర్‌ డెయిరీ దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ (National Capital Region) పరిధిలో లీటర్‌ పాలపై రూ.1  లీటర్‌ విడిపాల (token milk) ధర రూ.2 పెంచింది. 

దీంతో పెరిగిన ధరలతో ఫుల్‌ క్రీమ్‌ (వెన్నతీయని) పాల ధర రూ.64, విడి పాల ధర రూ.48 నుంచి రూ.50కి పెరిగింది. కాగా, అర లీటర్‌ ఫుల్‌ క్రీమ్‌ పాల ధరల్ని యథాతథంగా ఉంచుతున్నట్లు మధర్‌ డైరీ ప్రతినిధులు తెలిపారు. ఇక తాజాగా పెరిగిన పాల ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి.    


 

మరిన్ని వార్తలు