సంచలనం : ప్రపంచంలో తొలి 200 మెగాపిక్సెల్ ఫోన్.. ధర ఎంతంటే!

28 Jul, 2022 21:09 IST|Sakshi

అమెరికా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ మోటరోలా ప్రపంచంలో తొలిసారి 200ఎంపీ మెగా ఫిక్సెల్‌ కెమెరాతో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. మోటో ఎక్స్‌ 30 ప్రో పేరుతో ఈ ఫోన్‌ ఆగస్ట్‌ 2న చైనాలో విడుదల కానుంది. 

చైనా మీడియా కథనాల ప్రకారం..మోటో ఎక్స్‌ 30 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్‌ జనరేషన్‌ 1 ప్రాసెసర్‌, 125 డబ్ల్యూ జెన్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌ 12జీబీ ర్యామ్‌ సౌకర్యం ఉందని పేర్కొన్నాయి.ఇక ఈ ఫోన్‌లో డ్రమెటిక్‌ బ్యాగ్‌ గ్రౌండ్‌ ఇమేజెస్‌ తీసుకునేందుకు  85 ఎంఎం, 50 ఎంఎం, 35 ఎంఎం లెన్స్ ఫోకల్‌ లెగ్త్‌ సెన్సార్లు ఉన్నాయి.

దీంతో పాటు క్లోజప్‌, పోట్రేట్‌ షాట్స్‌, 50 ఎంఎం లెన్స్‌తో స్టాండర్డ్‌ వ్యూయింగ్‌ యాంగిల్‌ ఫోటోలు తీసుకోవచ్చు. 35 ఎంఎం లెన్స్ తో క్లోసెస్ట్ వ్యూయింగ్ యాంగిల్‌లో సైతం ఫోటోల్ని ఫోన్‌లో క్యాప్చర్‌ చేయొచ్చు.


   
మోటో ఎక్స్‌ 30 ప్రో స్పెసిఫికేషన్‌లు 
వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం..మోటో ఎక్స్‌ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఎక్స్‌ 30 ప్రో హెచ్‌డీప్లస్‌ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌,  8జీబీ ర్యామ్‌ ప్లస్‌ 128జీబీ స్టోరేజ్‌, 12జీబీ ర్యామ్‌ ప్లస్‌ 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లలో లభ్యం కానుంది.  12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ మోడల్ ధర సుమారు రూ.59,990 ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు