బడ్జెట్‌లో మోటో 5జీ ఫోన్

27 Nov, 2020 10:21 IST|Sakshi

మోటరోలా చివరకు తన మోటో జి 5జీని త్వరలో భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని మోటొరోలా ట్వీటర్ ద్వారా ప్రకటించింది. మిడ్-రేంజ్ విభాగంలో 5జి ఫోన్‌ను లాంచ్ చేయాలని మోటోరోలా చాలాకాలంగా ఎదురుచూస్తుంది. ఈ ఫోన్ గతంలోనే యూరోప్‌లో లాంచ్ అయింది. మోటో జి 5జీ 4 జీబీ + 64 జీబీ వేరియంట్ యొక్క ధర యూరప్‌లో 299.99 యూరోలు(సుమారు రూ.26,300)గా నిర్ణయించింది. ట్విట్టర్ లో కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో యూరప్ కంటే కొంచెం తక్కువ ధరకే తీసుకురానుంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే మొబైల్ బెస్ట్ డీల్స్

మోటో జి 5జీ స్పెసిఫికేషన్స్
మోటో జీ 5జీలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్టీపీఎస్ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ పై మోటో జీ 5జీ పనిచేయనుంది. దీని ర్యామ్ 4జీబీ కాగా, 64జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది. దీనిలో మైక్రో ఎస్‌డి కార్డ్ వేసుకోవడం ద్వారా 1టెరాబైట్ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జి 5జీ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనిలో 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 5జీ, వైఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు