సూపర్‌ ఫీచర్లతో మోటరోలా మరో అద్భుతమైన ఫోన్

20 Mar, 2021 14:46 IST|Sakshi

బిగ్‌ కెమెరా, బిగ్‌ బ్యాటరీ

మోటరోలా జీ 60 త్వరలో లాంచ్‌ 

సాక్షి, ముంబై:  ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు మోటరోలా  అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. రెడ్‌మి, రియల్‌మీ తరహాలో  108 మెగా పిక్సెల్  భారీ  రియర్‌  కెమెరాతో ఫోన్‌ను లాంచ్  చేయాలని ప్లాన్‌ చేస్తోంది.  జీసిరీస్‌లో భాగంగా జీ 60 పేరుతో ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్‌లతో  ఆవిష్కరించనుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్,  120 హెర్ట్జ్ డిస్‌ప్లేతోసాటు,  డ్యుయల్‌ సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా రానుందని  అంచనా. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్)  ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సిసి) నుండి ధృవీకరణ లబించినఅనంతరం ఈ ఫోన్ భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.  870 చిప్‌సెట్‌తో కూడిన మరో మోటరోలా ఫోన్‌ ఇది కావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే జీ సిరీస్‌లో మోటో  జీ100 ను  మార్చి 25న  విడుదల చేయనున్నట్లు  ఇప్పటికే పలు ఊహాగానాలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి.   (ఐటెల్‌ ఆండ్రాయిడ్‌ టీవీలు వచ్చేశాయ్‌!)

మోటో జీ 60 ఫీచర్లు
6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 11
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
108 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ఐసోసెల్ హెచ్‌ఎం 2 ప్రైమరీ సెన్సార్
16 ఎంపీ, 8 ఎంపీ సెన్సార్‌
2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ 
32 +16  ఎంపీ  డ్యుయల్‌   సెల్ఫీ కెమెరా 
6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని 


 

మరిన్ని వార్తలు