మోటరోలా ఎడ్జ్‌ 30 ఫ్యూజన్‌

13 Jan, 2023 02:50 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ బ్రాండ్‌ మోటరోలా తాజాగా ఎడ్జ్‌ 30 ఫ్యూజన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో తొలిసారిగా వివా మజెంటా రంగులో ఈ 5జీ ఫోన్‌ను రూపొందించింది.

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888ప్లస్‌ చిప్‌సెట్, 6.55 అంగుళాల 144 హెట్జ్, 10–బిట్‌ పాలిమర్‌ ఆర్గానిక్‌ ఎల్‌ఈడీ (పోలెడ్‌) డిస్‌ప్లే, 13 ఎంపీ అల్ట్రావైడ్‌ ప్లస్‌ మాక్రో షూటర్‌తో 50 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ మెయిన్‌ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 68 వాట్‌ టర్బోపవర్‌ చార్జర్‌తో 4400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఏర్పాటు ఉంది. 13 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ప్రారంభ ఆఫర్‌ ధర రూ.39,999.   

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు