మోటోరోలా ఎడ్జ్ ఎస్‌లో అదిరిపోయే ఫీచర్స్

27 Jan, 2021 19:08 IST|Sakshi

మోటొరోలా తన కొత్త ఫోన్ ఎడ్జ్ ఎస్‌ మొబైల్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో గత వారం క్వాల్‌కామ్ కంపెనీ తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ను తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ తో విడుదలైన మొట్టమొదటి మొబైల్ ఇదే. మోటరోలా ఎడ్జ్ ఎస్‌లో డ్యూయల్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్, గ్రేడియంట్ బ్యాక్ ఫినిష్ ఉన్నాయి. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు రెండు కెమెరాలను తీసుకొచ్చారు. ఎడ్జ్ ఎస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.(చదవండి: పోకో ఎం3 వచ్చేది ఎప్పుడంటే?)

మోటరోలా ఎడ్జ్ ఎస్ ఫీచర్స్:
డ్యూయల్ సిమ్(నానో) మోటరోలా ఎడ్జ్ ఎస్ ఆండ్రాయిడ్ 11లో మైయుఐ మీద నడుస్తుంది. దీని యాస్పెక్ట్ రేషియో 21:9గా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, అడ్రినో 650 జీపీయును తీసుకొచ్చారు. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ(యుఎఫ్ఎస్ 3.1) వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ఇది క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఎడ్జ్ ఎస్‌లో 64 మెగాపిక్సెల్(ఎఫ్/1.7) ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.(చదవండి: టిక్‌టాక్ ఉద్యోగుల తొలగింపు)

వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. మోటరోలా 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. దీని బరువు 215 గ్రాములు.  

మోటరోలా ఎడ్జ్ ఎస్ ధర:
మోటరోలా ఎడ్జ్ ఎస్ 6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర సిఎన్‌వై 1,999(సుమారు రూ.22,600), 8జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర సిఎన్‌వై 2,399(సుమారు రూ.27,000)గా నిర్ణయించారు. టాప్-ఆఫ్-ది-లైన్ 8జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సిఎన్‌వై 2,799(సుమారు రూ.31,600)గా ఉంది. ఫోన్ ఎమరాల్డ్ లైట్, స్నో, మిస్ట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

>
మరిన్ని వార్తలు