Motorola: భారత మార్కెట్లపై దండయాత్ర చేయనున్న మోటరోలా..!

20 Nov, 2021 21:45 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం మోటరోలా భారత మార్కెట్లపై కొత్త మోడళ్లతో దండయాత్ర చేయనుంది.  మోటరోలా జీ సిరీస్‌లో భాగంగా ఏకంగా ఐదు మోడళ్లను రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. జీ200, జీ71, జీ51, జీ41, జీ31 స్మార్ట్‌ఫోన్లను మోటరోలా త్వరలోనే లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మోటో జీ200 స్మార్ట్‌ఫోన్‌ అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో రానుంది. అంతేకాకుండా 144హెర్జ్‌ డిస్‌ప్లే ర్రిఫెష్‌ రేట్‌తో రానున్నట్లు తెలుస్తోంది.  

ఈ స్మార్ట్‌ఫోన్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వద్ద కనిపించినట్లు తెలుస్తోంది.  అన్ని మోడల్‌లు 5,000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాలతో రానున్నాయి.  మోటో జీ200 స్నాప్‌డ్రాగన్‌ 888+ ప్రాసెసర్‌తో, మోటో జీ71 స్నాప్‌డ్రాగన్‌ 695,  మోటో51 స్నాప్‌ డ్రాగన్‌  480+తో మోటో జీ41 మీడియా టెక్‌ హెలియో జీ85 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. 

మోటరోలా జీ200 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 37900, మోటో జీ71 ధర సుమారు రూ. 25,300, మోటో జీ51 సుమారు రూ. 19,372 కు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మోటో జీ41 ధర 21 వేలకు  మోటో జీ 31 ధర రూ. 16,900 గా ఉండనుంది. 
చదవండి: మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి అదిరిపోయే హ్యాచ్‌బ్యాక్‌ కార్‌..! ధర ఎంతంటే..?

మరిన్ని వార్తలు