మోటోరోలా నుంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్ 

27 Dec, 2020 15:47 IST|Sakshi

ప్రపంచంలో మొట్టమొదటి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి మార్కెట్లో రేసు కొనసాగుతోంది. ఇప్పటికే షియోమీ, రియల్మీ, శామ్‌సంగ్ కంపెనీలు స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్తో మొబైల్ని తీసుకొస్తునట్టు ప్రకటించాయి. తాజాగా మోటరోలా కూడా అతి త్వరలో రంగంలోకి దిగబోతున్నట్లు కనిపిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో మోటోరోలా తీసుకురాబోయే మొబైల్ గురుంచి సమాచారం చాలా తక్కువగా ఉంది. లెనోవా ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ తెలిపిన పోస్ట్ ప్రకారం కొత్తగా తీసుకురాబోయే మొబైల్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పని చేయవచ్చు.(చదవండి: 9 ఏళ్లలో శామ్‌సంగ్ కి ఇదే మొదటి సారి)

మోటరోలా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎడ్జ్ ప్లస్‌తో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫోన్‌ను ప్రవేశపెట్టింది. 5జీ-ఎనేబుల్డ్ ఎడ్జ్ ప్లస్ ఆన్‌లైన్‌లో సుమారు రూ.65,000కు లభిస్తుంది. ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోయే మొబైల్స్ 2021 ప్రారంభంలో తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం మొట్ట మొదటిగా షియోమీ రేపు(డిసెంబర్ 28) విడుదల చేసే ఎంఐ 11 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకురానున్నట్లు సమాచారం. ఎంఐ 11 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్  క్వాడ్ హెచ్‌డి + డిస్‌ప్లేతో రానుంది. 4,780 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుందని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు