లీకైన మోటరోలా 'నియో' ఫీచర్స్

19 Jan, 2021 14:34 IST|Sakshi

మోటరోలా 'నియో' అనే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ఫీచర్స్ ఇంటర్ నెట్ లో లీక్ అయ్యాయి. మోటరోలా 'నియో' లీకైన చిత్రాలు మొదట వీబోలో కనిపించాయి. మోటరోలా 'నియో' పిక్స్ కొన్ని వాయిస్‌లో నిల్స్ అహ్రెన్స్‌మీర్ లీక్ చేసారు. వాయిస్ పోస్ట్ ప్రకారం మోటరోలా నియో 'బెరిల్' కలర్ వేరియంట్ లో లభించనుంది. లీకైన చిత్రాలు మోటరోలా నియోలో డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: ఫేస్‌బుక్‌లో‌ లైక్ బటన్ కనిపించదు)

మోటరోలా నియో 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ప్లేని కలిగి ఉండనుంది. ఇది క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ + 128జీబీ, 12జీబీ + 256జీబీ రెండు మెమరీ వేరియంట్‌లు లభించనున్నాయి. మోటరోలా నియో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెకండరీ కెమెరా,  2ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్,  2 ఎంపీ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు