మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

5 Oct, 2020 13:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లెనోవాకు చెందిన మోటరోలా కంపెనీ మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్‌ను  భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మోటో రేజర్ కి కొనసాగింపుగా ఆండ్రాయిడ్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. “క్విక్ వ్యూ”  డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జీ సాక్ ప్రధాన ఫీచర్లుగా ఈ సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 

మోటరోలా రేజర్ 5జీ ధర, లాంచ్ ఆఫర్లు
భారతదేశంలో మోటరోలా రేజర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 1,24,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. గ్రాఫైట్ కలర్ ఆప్షన్‌లో లభ్యం. ఈ రోజు నుండి ప్రీ-బుకింగ్స్ మొదలు పెట్టింది. అక్టోబర్ 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, అన్ని ప్రముఖ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల ఈఎంఐ లావాదేవీలపై 10,000 తక్షణ తగ్గింపు.  జియో కస్టమర్లు రూ. 4,999 వార్షిక ప్రణాళికలో డబుల్ డేటా ఆఫర్  చేయనుంది.  


మోటో రేజర్ 5జీ  ఫీచర్లు
6.2 అంగుళాల ఓఎల్ఈడీ ఫోల్డ్ డిస్‌ప్లే
వెనుక 2.7 అంగుళాల ఫోల్డ్ సెకండరీ డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్ 
ఆండ్రాయిడ్ 10
8జీబీ  ర్యామ్‌ 256జీబీ  స్టోరేజ్
48 మెగాపిక్సెల్  కెమెరా 
20 మెగాపిక్సెల్  సెల్ఫీ కెమెరా
15వాట్స్ టర్బోపవర్ ఛార్జర్‌
2800 ఎంఏహెచ్ బ్యాటరీ 

మరిన్ని వార్తలు