మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ : ధర?

10 Sep, 2020 18:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లెనోవాకు చెందిన మోటరోలా కంపెనీ మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటో రేజర్ కి కొనసాగింపుగా  ఆండ్రాయిడ్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, కెమరాల్లో మార్పులు, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌తో ముందు మొబైల్ కంటే చాలా చౌకగా దీన్ని విడుదల చేసింది. అలాగే కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11కి అప్‌గ్రేడ్ చేయవచ్చని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సుమారు రూ .102,600 ధరతో లాంచ్ చేసింది. (మోటో రేజర్  ధర రూ.1,24999). గ్రాఫైట్, బ్లష్ గోల్డ్ లిక్విడ్ మెర్క్యురీ మూడు రంగుల్లో లభ్యం.

మోటో రేజర్ 5జీ  ఫీచర్లు
6.2 అంగుళాల ఫోల్డ్ డిస్‌ప్లే
వెనుక 2.7 అంగుళాల ఫోల్డ్ సెకండరీ డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్ 
ఆండ్రాయిడ్ 10
8జీబీ  ర్యామ్‌ 256జీబీ  స్టోరేజ్
48 మెగాపిక్సెల్  కెమెరా 
20 మెగాపిక్సెల్  సెల్ఫీ కెమెరా
15వాట్స్ టర్బోపవర్ ఛార్జర్‌
2800 ఎంఏహెచ్ బ్యాటరీ 
ప్రస్తుతానికి చైనా, యూరోపియన్ మార్కెట్లో లభించనుంది. ఇండియాలో లాంచింగ్ తేదీని మోటరోలా ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు