5జీ సేవలు: రిలయన్స్‌ జియోతో జతకట్టిన మోటరోలా

4 Jan, 2023 15:53 IST|Sakshi

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోతో ,స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ మోటరోలా భాగస్వామ్యం కుదుర్చుకుని తన కస్టమర్లకు 'ట్రూ 5 జీ' అనుభవాన్ని అందిస్తోంది. ఈ భాగస్వామ్యంతో మోటరోలా వినియోగదారులు 5G పోర్ట్‌ఫోలియోలో జియో ట్రూ 5జీ సేవలను ఉపయోగించవచ్చు. అందుకోసం మోటరోలా తమ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కూడా విడుదల చేసింది.

రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ దీనిపై మాట్లాడుతూ..  ‘మోటరోలా క్యారియర్ అగ్రిగేషన్, 4x4 Mimo,  5G బ్యాండ్‌లకు సపోర్ట్‌ వంటి లేటెస్ట్‌ టెక్నాలజీ, 5జీ ఫీచర్లతో వస్తుందన్నారు. ఈ ఫీచర్లు జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో పాటు భారతదేశంలో 5జీ సేవలకు సంబంధించిన నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయన్నారు. మోటరోలా స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్న జియో యూజర్లు  ఇకపై Jio True 5G సేవలు అందిస్తున్న ప్రాంతాలలో జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అన్‌లిమిటెడ్‌ 5జీ ఇంటర్నెట్‌ యాక్సెస్ కూడా పొందగలరని చెప్పారు.

‘మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు లేటెస్ట్‌ టెక్నాలజీ, ఫీచర్లుతో పాటు వేగవంతమైన 5G అనుభవాన్ని అందిస్తాయి. తమ కస్టమర్లకు ట్రూ 5జీ అందించాలనే మా నిబద్ధతకు కంపెనీ కట్టుబడి ఉంది. మోటరోలా కంపెనీ భారత్‌లోని తన కస్టమర్లకు అత్యంత సమగ్రమైన, ఎక్కడా కూడా రాజీ లేకుండా 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 13 5G బ్యాండ్‌లకు సపోర్ట్‌ ఇస్తోందని’ మోటరోలా ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి తెలిపారు. జియో ట్రూ 5 జీస్టాండ్‌లోన్‌ (ఎస్ఎ) నెట్ వర్క్‌ను యాక్సెస్ చేసుకోవడానికి కస్టమర్లు తమ మొటోరోలా స్మార్ట్‌ ఫోన్‌ స్టెట్టింగ్‌లలో ఇష్పడే నెట్ వర్క్‌ను 5జీకి మార్చుకోవాల్సి ఉంటుంది.

చదవండి: iPhone 14: వావ్‌ ఐఫోన్‌ పై మరో క్రేజీ ఆఫర్‌! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!

మరిన్ని వార్తలు