సమ్‌థింగ్ బిగ్ : మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ త్వరలో

21 Aug, 2020 10:32 IST|Sakshi

సమ్ థింగ్ బిగ్ ఈజ్ కమింగ్

ఆగస్టు 24 న లాంచ్ 

సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు మోటరోలా త్వరలో భారతీయ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. అద్భుతమైన పనితనం, అద్భుతమైన కెమెరా.. సిద్ధంగా ఉండండి అంటూ ఒక టీజర్ రిలీజ్ చేసింది. దేశంలో తమ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా లాంచ్ చేయనున్నామని ట్వీట్ చేసింది. ఆగస్టు 24 న లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.    

అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌  పేరు, ఫీచర్లను  స్పష్టం చేయనప్పటికీ, మోటో ఈ7 ప్లస్‌ పేరుతో దీన్ని తీసుకు రానుందని అంచనా.  బిగ్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,  స్పీకర్ గ్రిల్‌ను టీజర్‌లో గుర్తించవచ్చు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ  ర్యామ్, 64 జిబి స్టోరేజ్ , డ్యూయల్-రియర్ కెమెరా  ప్రధాన ఆకర్షణీయంగా ఉండనున్నాయని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు