టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్‌...!

6 Oct, 2021 19:53 IST|Sakshi

టీమీండియాకు జెర్సీ అందిస్తోన్న ప్రముఖ ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఏమ్‌పీఎల్‌)కు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్‌నిచ్చింది.  కర్ణాటకలో ఎమ్‌పీఎల్‌ను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌గేమింగ్‌, గ్యాబ్లింగ్‌, బెట్టింగ్‌ యాప్స్‌పై కర్ణాటక ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకపడింది.  కర్ణాటకలో నిషేధానికి గురైన తొలి ఆన్‌గేమింగ్‌ యాప్‌గా ఎమ్‌పీఎల్‌ నిలిచింది. అక్టోబర్‌ 5 నుంచి ఎమ్‌పీఎల్‌పై కర్ణాటక ప్రభుత్వం  నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఎమ్‌పీఎల్‌ యాప్‌ను వాడుతున్న యూజర్లకు ‘ మీ రాష్ట్రంలో ఫాంటసీ స్పోర్ట్స్ ఆడేందుకు నిషేధం ఉన్నట్లు సందేశాన్ని చూపిస్తోన్నట్లు పలు యూజర్లు పేర్కొన్నారు.  
చదవండి: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్‌ ఎప్పుడంటే..

ఆన్‌లైన్‌ గేమింగ్‌ బూమ్‌...!
దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌, గ్యాబ్లింగ్‌, బెట్టింగ్‌ యాప్స్‌ను యూజర్లు భారీ ఎత్తున వాడుతున్నారు. దీంతో పలు  ఇన్వెస్టర్లు ఆయా బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్స్‌పై విచ్చలవిడిగా పెట్టుబడులను పెడుతున్నారు. ఇటీవలి కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు మిలియన్ డాలర్లకు పైగా గేమింగ్‌ యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయగా..ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంతో గేమింగ్‌ రంగానికి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉందని గేమింగ్‌ రంగ నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల తరువాత ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమింగ్‌పై నిషేధం విధించిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇంతకుముందు ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమింగ్స్‌పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిన బిల్లును అక్కడి హైకోర్టు కొట్టివేసింది. 

డ్రీమ్‌-11 ఇంకా నడుస్తోంది...!
టైగర్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌చేసిన డ్రీమ్‌ 11 కర్ణాటకలో ఇంకా పనిచేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫాంటసీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఎమ్‌పీఎల్‌, పేటిఏమ్ ఫస్ట్‌ గేమ్స్‌పై మాత్రం కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడం గమనార్హం. కాగా ఈ విషయంపై ఎమ్‌పీఎల్‌, పేటీఎం స్పందించలేదు. 
చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్‌ రిపీట్‌..! 

మరిన్ని వార్తలు