డివిడెండ్‌ ప్రకటించిన ఎంఆర్‌ఎఫ్‌

8 Jun, 2021 08:55 IST|Sakshi

ఎంఆర్‌ఎఫ్‌ డివిడెండ్‌ రూ. 94

 క్యూ4లో లాభాలు డౌన్‌ 

 రూ. 332 కోట్లకు పరిమితం 

న్యూఢిల్లీ: టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ గతేడాది(2020–21) నాలుగో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 51 శాతం పడిపోయింది. రూ. 332 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 679 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,685 కోట్ల నుంచి రూ. 4,816 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 94 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ప్రత్యేక డివిడెండ్‌సహా దీంతో కలిపి గతేడాది మొత్తం రూ. 150 డివిడెండ్‌ చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది.

మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎంఆర్‌ఎఫ్‌ రూ. 1,277 కోట్ల నికర లాభం సాధించింది. 2019–20లో రూ. 1,423 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 16,239 కోట్ల నుంచి స్వల్ప వెనకడుగుతో రూ. 16,163 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి.   ఎంఆర్‌ఎఫ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3% పతనమై రూ. 82,310 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు