ధోనీ పేరుతో కొత్త రకం చాక్లెట్‌‌

7 Apr, 2021 14:58 IST|Sakshi

ముంబై: మార్కెట్‌లో ఫేమ్‌, నేమ్‌ ఉంటే చాలు బిజినెస్‌ చేయడానికి చాలా మార్గాలే ఉన్నాయి. దీన్నే​ ఇప్పడు ‘7 ఇంక్‌బ్రూస్‌’ అనే చాక్లెట్‌ కంపెనీ పాటిస్తోంది. అది ఎలా అంటారా..టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ పేరుతో ఈ కంపెనీ చాక్లెట్లను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నాయి. ధోనీకి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను ఇలా మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోని ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే తన క్రేజ్‌ కూడా. ఇక ధోనీ ఆట అంటే ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేది  అతని వైవిధ్యమైన హెలికాప్టర్‌ షాట్‌. దీనికే ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. కనుకే ముంబైకి చెందిన ‘7 ఇంక్‌బ్రూస్’‌ అనే పుడ్‌ అండ్‌ బెవరేజస్‌ స్టార్టప్ కంపెనీ‌, తయారు చేస్తున్న చాక్లెట్లకు ‘కాప్టర్ 7’ అని పేరు పెట్టింది. ఇక వాటి ప్యాకేజింగ్, లేబులింగ్ వంటివి ఈ చాక్లెట్‌కు అదనపు అందాన్ని జోడించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అలాగే ఇది ధోని విభిన్న జెర్సీలు వాటి రంగులతో వీటి లేబుల్‌ను తయారు చేస్తున్నారు.

వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ భగ్‌చందని మాట్లాడుతూ ధోనీ లక్షణమైన “అన్‌డైయింగ్ ‘కాన్ట్‌ స్టాప్, వోన్‌ట్‌ స్టాప్’  స్పిరిట్ ’ క్యాప్షన్‌ ను  బ్రాండ్గా వాడాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇవి ముంబై, గోవా, బెంగుళూరులో అందుబాటులలోకి రాగా, త్వరలో జార్ఘండ్‌​, యూపీ, హర్యానా, పంజాబ్‌ లోనూ దొరకనున్నట్లు తెలిపారు. ఈ కంపెనీలో ధోనీ కూడా భాగస్వామ్యం కావడం విశేషం. 7 ఇంక్ బ్రూస్ వంటి సంస్థకు వాటాదారునిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం నాకు నిజంగా సంతోషంగా ఉందంటూ ” పత్రికా ప్రకటనలో ధోని పేర్కొన్నారు.

( చదవండి: IPL2021: చెన్నై జట్టుకు క్షమాపణలు చెప్పిన స్కాట్‌ స్టైరిస్‌ )

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు