జండర్‌ న్యూట్రల్‌ వ్యాక్సిన్‌ వచ్చేసింది

30 Sep, 2021 13:02 IST|Sakshi

గార్డ్‌సిల్‌9 టీకా విడుదల చేసిన ఎంఎస్‌డీ ఫార్మా 

న్యూఢిల్లీ: జండర్‌ న్యూట్రల్‌(ఆడా, మగా అందరూ తీసుకోదగిన) హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్‌9ను ఎంఎస్‌డీ ఫార్మా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 9 వాలెంట్‌ హెచ్‌పీవీ వైరస్‌ టీకా హెచ్‌పీవీ టైప్స్‌ 6, 11,16, 18, 31, 33, 45, 52, 58 రకాలపై పనిచేస్తుందని తెలిపింది. హెచ్‌పీవీ కారణంగా వచ్చే పులిపర్లలాంటివాటి నిరోధంలో, ఈ వైరస్‌ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో టీకా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది.

మగ(9–15 సంవత్సరాలు), ఆడ(9–26 సంవత్సరాలు)వారికి ఈ టీకాను ఇవ్వవచ్చని, గార్డ్‌సిల్‌9 విడుదల ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో కీలక మలుపని కంపెనీ డైరెక్టర్‌ రెహాన్‌ ఖాన్‌ చెప్పారు. ఈ వైరస్‌లు ఆడవారికి, మగవారికి సోకుతాయి, అందువల్లనే జెండర్‌ న్యూట్రల్‌(ఎవరైనా తీసుకోగలిగేది) టీకా తెచ్చామన్నారు. పిల్లల్లో, వారి తల్లిదండ్రుల్లో ప్రివెంటివ్‌ కేర్‌ గురించి, హెచ్‌పీవీ దానివల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు చర్యలు అవసరమన్నారు. (కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు