ఎంఎస్‌ఎంఈల నుంచి కొత్త ఉత్పత్తులు

23 Sep, 2022 08:54 IST|Sakshi

పండుగలకు ముందే ఆవిష్కరణ

మీషో సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రతి మూడింటిలో ఒకటి పండుగలకు ముందే కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాలని అనుకుంటున్నాయి. ప్రచార కార్యక్రమాలు, డిస్కౌంట్లపై దృష్టి పెట్టనున్నట్టు 34 శాతం కంపెనీలు తెలిపాయి. మీషో–కాంటార్‌ సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. సెప్టెంబర్‌ 23 నుంచి ఈ కామర్స్‌ సంస్థల పండుగల ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇప్పటికే సేల్స్‌ను ప్రకటించాయి. ఆన్‌లైన్‌ విక్రేతల పండుగల విక్రయాల సన్నద్ధతను తెలుసుకునేందుకు మీషో కాంటార్‌ సర్వే ప్రయత్నించింది.

సర్వే అంశాలు.. 
►  36 శాతం మంది కొత్త ఉత్పత్తులను పండుగలకు ముందు విడుదల చేయనున్నట్టు తెలిపాయి.
►  ప్రమోషన్లు, డిస్కౌంట్లను ప్రకటించనున్నట్టు 34 శాతం కంపెనీలు వెల్లడించాయి.
►  ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడంపై ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు 33 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. 
►  పండుగల డిమాండ్‌ను తట్టుకునేందకు అదనపు స్టాక్‌ను సమకూర్చుకుంటామని 32 శాతం కంపెనీలు చెప్పాయి.
►  కొత్త కస్టమర్లను చేరుకోవాలని 40 శాతం కంపెనీలు కోరుకుంటున్నాయి.
►  దేశవ్యాప్తంగా 787 ఆన్‌లైన్‌ విక్రయదారుల నుంచి ఈ అభిప్రాయాలను మీషో సర్వే తెలుసుకుంది.

చదవండి: ఆ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు!

మరిన్ని వార్తలు