2-డీజీ కోసం డీఆర్‌డీఓతో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఒప్పందం

9 Jul, 2021 18:23 IST|Sakshi

భారతదేశంలో 2 - డీయోక్సీ-డీ-గ్లూకోజ్(2-డీజీ) తయారీ, పంపిణీ కోసం ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్.. డీఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఈ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) సంస్థలతో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ రోజు ప్రకటించింది. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీకి దేశంలో మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. 

కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చేరిన బాధితులు త్వరగా కోలుకోవడానికి, ఆక్సిజన్‌పై ఆధారపడడాన్ని తగ్గించడానికి 2-డీజీ యాంటీ–కోవిడ్‌ డ్రగ్‌ ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎన్ ల్యాబ్‌లు 2-డీజీని రోజుకు రెండుసార్లు సాచెట్ రూపంలో 2.34 గ్రాముల శక్తితో ఎంఎస్ఎన్ 2డీ బ్రాండ్ పేరుతో విడుదల చేయనున్నాయి. కరోనా చికిత్సలలో భాగంగా, ఎంఎస్ఎన్ ఇప్పటికే ‘‘OSELOW’’ బ్రాండ్ పేరుతో ఒసెల్టామివిర్ క్యాప్సూల్స్ వంటి ఇతర యాంటీ-వైరల్ ఔషధాలను విడుదల చేసింది. 'ఫావిలో' బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ వంటి యాంటీ కోవిడ్ మందులు, 'బారిడోజ్' బ్రాండ్ పేరుతో బారిసిటినిబ్, పోసాకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ మందులను 'పోసాన్' బ్రాండ్ పేరుతో తీసుకొచ్చింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు