కలకలం, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి బెదిరింపు కాల్స్‌!

15 Aug, 2022 13:26 IST|Sakshi

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ పారశ్రామిక వేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.   

రిలయన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన హరికిషన్‌ దాస్‌ హాస్పిటల్‌ ఫోన్‌ నెంబర్‌ నుంచి గుర్తు తెలియని దుండగుడు ముఖేష్‌ అంబానీ, ఆయన కుటుంబసభ్యులకు 3సార్ల కంటే ఎక్కువ సార్లు ఫోన్‌ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అంబానీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. థ్రెట్‌ కాల్స్‌పై సమచారం అందుకున్న డీబీ మార్గ్‌ పోలీసులు  అప్రమత్తమయ్యారు. అనుమానితుల కోసం దర్యాప్తు ముమ్మం చేశారు.

కాగా గతేడాది ముకేశ్ అంబానీ నివాసం 'ఆంటిలియా' వెలుపల  20 పేలుడు జిలెటిన్ స్టిక్స్ ఉన్న స్కార్పియో కారుతో పాటు బెదిరింపు లేఖ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపులపై సమాచారం అందుకున్న పోలీసులు ముంబై ఎన్‌ కౌంటర్‌ స్పెషలిస్ట్‌ సచిన్‌ హిందూరావ్‌ వాజే (సచిన్‌ వాజే) నేతృత్వంలోని ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో సహా పలువురు పోలీసులు విచారణ కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సచిన్‌ వాజే ఈ కేసును దర్యాప్తు ప్రారంభించారు. 

దర్యాప్తు జరుగుతుండగా..ఈ కేసులో సంబంధం ఉన్న థానేకు చెందిన వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదగా మరణించారు. హిరేన్‌ మరణంగా ఆ కేసు ఎన్‌ఐఏ చేతిలోకి వెళ్లింది. కాగా, అంబానీ నివాసం వెలుపల దొరికిన స్కార్పియో తనదేనని యజమాని హిరేన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆ తర్వాత అంటే మార్చి 5,2021న థానే సమీపంలో ఓ ముళ్ల పొదల్లో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆ కేసు విచారణ జరుగుతుండగా..ఈరోజు ముఖేష్‌ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్‌ రావడం కలకలం రేపుతుంది.

చదవండి👉 ‘ప్రదీప్‌ శర్మకు నా భర్త కలెక్షన్‌ ఏజెంట్‌’

మరిన్ని వార్తలు