ముకేష్‌ అంబానీ ఖాతాలో మరో రికార్డు

8 Aug, 2020 20:55 IST|Sakshi

ఎల్‌వీఎంహెచ్‌ సంస్థ చైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్‌ను దాటేసిన ముకేష్‌

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అ‍త్యంత సంపన్నుల జాబితాలో తాజాగా ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ముకేష్‌ అంబానీ.. అమెజాన్ అధినేత జేఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ తర్వాత స్థానంలో ఉన్నారు. ఈ ఇండెక్స్‌లో ముకేష్‌ అంబానీ 80.2 బిలియన్‌ డాలర్ల(సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు) సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ను దాటేసి నాలుగో స్థానంలో నిలిచారు. కొన్నేళ్లుగా ఈ ఇండెక్స్‌లో అమెరికన్స్ మాత్రమే టాప్ 5లో ఉంటూ వచ్చారు. బెజోస్, బిల్ గేట్స్, గూగుల్ అధినేతలు సెర్గీ, లారీ పేజ్, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ వంటివాళ్లు టాప్ పొజిషన్‌లో ఉండేవారు. తాజాగా వారి జాబితాలో ముకేష్‌ అంబానీ చేరారు.  ఫ్యాషన్ టైకూన్ ఆర్నాల్ట్, వారెన్ బఫెట్, స్టీవ్ బాల్మర్, లారీ పేజ్, సెర్గీ బ్రెయిన్ ఎలన్ మాస్క్ సహా అందరినీ వెనక్కు నెట్టారు అంబానీ. బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించిన నివేదికలో 10 మంది ప్రపంచ  కుబేరుల్లో 8 మంది అమెరికాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరి సరసన చేరిన ముకేష్‌ అంబానీ భారత్‌ నుంచే కాక ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. (రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. గ్లోబల్‌ టాప్‌–2)

ఇక ఈ ఇండెక్స్‌లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి 187 బిలియన్ డాలర్ల సంపదతో ప్రథమ స్థానంలో ఉండగా.. 121 బిలియన్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆస్తి 102 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ముకేష్ అంబానీ ఆస్తి 80.2బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు. ఫ్యాషన్ టైకూన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ 80.2 బిలియన్ డాలర్ల సంపదతో ముకేష్‌‌ అంబానీ తర్వాత స్థానంలో ఉన్నారు.  ఈ ఏడాది రిలయన్స్ టెలికాం  విభాగం  జియో ప్లాట్ ఫాంలోకి ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాప్ట్ పెట్టుబడులు పెట్టడంతో ఆయన కంపెనీల షేర్‌ విలువ భారీగా పెరిగింది. దాంతో ఆస్తులు కూడా పెరిగాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు