తాతైన ముఖేష్‌ అంబానీ

20 Nov, 2022 17:00 IST|Sakshi

రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ తాతయ్యారు. అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్..నవంబర్ 19న కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ..ఈ మేరకు అంబానీ, పిరమల్ కుటుంబాలు అధికారికంగా ప్రకటనను విడుదల చేశాయి.

ఇషాకు పుట్టిన కవల పిల్లలో..ఒక పాప, బాబు ఉన్నారు. పాపకు ఆదియా అని పేరు పెట్టగా, బాబుకు కృష్ణ అని పేర్లు పెట్టినట్టుగా ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.   

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ,నీతూ అంబానీల కుమార్తె ఇషా అంబానీ..పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌ల వివాహం 2018 డిసెంబర్‌లో జరిగింది. ప్రస్తుతం ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా ఆమె భర్త ఆనంద్ పిరమల్.. పిరమల్ గ్రూప్ ఆర్థిక సేవల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.

చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్‌ అంబానీ వీలునామా!

మరిన్ని వార్తలు