ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్‌ అంబానీ వీలునామా,ఇషాకు రీటైల్‌ బాధ్యతలు!

29 Aug, 2022 20:03 IST|Sakshi

దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్‌ గ్రూప్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపర కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌ రీటైల్‌ బాధ్యతల్ని కుమార్తె ఇషా అంబానీకి అప్పగించారు. 

రిలయన్స్‌ ఇండస్ట్రీ 45వ ఏజీఎం సమావేశంలో ముఖేష్‌ అంబానీ.. రిలయన్స్‌ రీటైల్‌ బాధ్యతల్ని ఇషా అంబానీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ముఖేష్‌ అంబానీ ప్రకటన అనంతరం రిలయన్స్‌ రీటైల్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా ఆర్డర్‌లు చేయడం, పేమెంట్స్‌ చేయడంతో పాటు ఎఫ్‌ఎంసీజీ విభాగంలోకి అడుగుపెడుడుతున్నట్లు తెలిపారు. ప్రతి భారతీయుడికి  హైక్వాలిటీ, తక్కువ ధరకే నిత్యవసర వస్తువుల్ని అందించేలా రీటైల్‌ విభాగాన్ని డెవలెప్‌ చేసినట్లు చెప్పారు. కాగా, సూపర్‌ మార్కెట్లు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యవెలరీ, ఫుట్‌వేర్, క్లాతింగ్‌ విభాగాలతోపాటు ఆన్‌లైన్‌ రిటైల్‌ వెంచర్‌ జియోమార్ట్‌ను రిలయన్స్‌ రిటైల్‌ విభాగంలోకి రానున్నాయి.      

ఆకాష్‌..ఈషా..అనంత్‌
ముకేష్‌ అంబానీ ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలుకాగా.. చిన్న కుమారుడు అనంత్‌. ఇప్పటికే ఈ ముగ్గురికి ముఖేష్‌ అంబానీ ఆస్తుల పంపకం ప్రక్రియను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో పెద్ద కొడుకు ఆకాశ్‌ ఎం.అంబానీకి టెలికం విభాగం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ నిర్వహణ బాధ్యతల్ని కట్టబెట్టారు. ఇందుకు అనుగుణంగా టెలికం బోర్డు నుంచి వైదొలిగారు. తాజాగా ఇషా అంబానీకి రిటైల్‌ గ్రూప్‌ బాధ్యతల్ని అప్పగించారు. చిన్న కొడుకు ముఖేష్‌ అంబానీకి న్యూఎనర్జీ బిజినెస్‌ విభాగాన్ని అప్పగించే యోచనలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి

శామ్ వాల్టన్ బాటలో ముఖేష్‌ అంబానీ
రిలయన్స్‌ లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం అన్నీ రంగాలలో విస్తరించి ఉంది. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కొనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేష్‌ అంబానీ..వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం పేర్కొంది.

ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారు. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నట్లు బ్లూంబర్గ్‌ తన కథనంలో హైలెట్‌ చేసింది.

మరిన్ని వార్తలు