ముఖేష్ అంబానీ నయా సూపర్ కారు - ధర ఎంతంటే?

4 Dec, 2023 11:10 IST|Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త, భారతదేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తి 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) ప్రపంచంలో ఖరీదైన నివాసాల్లో ఒకటైన యాంటిలియాలో నివసిస్తూ.. ఖరీదైన కార్లను ఉపయోగించే ఈయన ఇటీవల మరో సూపర్ కారుని కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన కొత్త కారు ఫెరారీ కంపెనీకి చెందిన రోమా. దీని ధర రూ. 4.5 కోట్లు అని తెలుస్తోంది. ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే లెక్కకు మించిన ఖరీదైన కార్లున్న అంబానీ గ్యారేజీకి మరో సూపర్ కారు చేరిపోయింది.

అంబానీ కుటుంబ సభ్యుల కాన్వాయ్‌లో మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63లు, రేంజ్ రోవర్ ఎస్‌యూవీలు, రోల్స్ రాయిస్ కల్లినన్ ఖరీదైన ఎన్నో కార్లు ఉన్నాయి. ముకేశ్ అంబానీ కార్ల ధర వందల కోట్లు ఉంటుందని సమాచారం. 

ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి8 ఇంజిన్ కలిగి 690 పీఎస్ పవర్, 760 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2021లో ప్రారంభమైన ఈ కారు మొదటి నుంచి ఎంతోమంది సెలబ్రిటీలను ఆకర్శించింది. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఈ కారుని కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో కారు కొనడం కష్టమేనా.. పెరగనున్న ఆ బ్రాండ్ ధరలు

ముఖేష్ అంబానీ గ్యారేజిలో సూపర్ కార్ల జాబితాలో ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, మెక్‌లారెన్ 570S, లంబోర్ఘిని అవెంటడోర్ S రోడ్‌స్టర్, ఫెరారీ 488 GTB, ఫెరారీ పోర్టోఫినో, ఆస్టన్ మార్టిన్ DB11 వంటి కార్లు ఉన్నాయి. కాగా తాజాగా ఇప్పుడు ఫెరారీ రోమా సూపర్ కారు లిస్ట్‌లో చేరింది.

>
మరిన్ని వార్తలు