భారతీయుల ప్రతిభపై చాట్‌జీపీటీ సృష్టికర్త సెటైర్లు, రంగంలోకి దిగిన ముఖేష్‌ అంబానీ 

28 Aug, 2023 20:26 IST|Sakshi

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఓపెన్‌ ఏఐ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ కృత్తిమ మేధ వంటి అధునాతమైన టెక్నాలజీల్లో భారతీయులు ప్రతిభను తగ్గిస్తూ మాట్లాడారు. తాజాగా, ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ ముఖేష్‌ అంబానీ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. 

రిలయన్స్‌ ఇండస్ట్రీ నిర్వహించిన 46వ వార్షిక సాధారణ సమావేశంలో శామ్‌ ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యలపై పరోక్షంగా ఛాలెంజ్‌ చేస్తూ ఆ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ మాట్లాడారు. ‘జియో హామీ ఇస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని జియో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రతి ఒక్కరికీ అందిస్తుంది’అని అన్నారు.  
 
ఆల్ట్‌మన్‌ ఏమన్నారు?
ఆసియా దేశాల పర్యటనలో భాగంగా ఆల్ట్‌మన్‌ ఈ ఏడాది జూన్‌ నెలలో భారత్‌ను సందర్శించారు. ఆ సమయంలో ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో భారతీయుల ప్రతిభ వంటి అంశాలపై మీడియా సంస్థలు పలు ప్రశ్నలు సంధించాయి. వాటికి సమాధానంగా చాట్‌జీపీటీ సృష్టికర్త మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడేది తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ భారతీయులు చాట్‌జీపీటీ లాంటి టూల్స్‌ను అభివృద్ది చేయలేరు. కాదని సంస్థలు ప్రయత్నిస్తే నిరాశజనకమైన ఫలితాలే వస్తాయంటూ విమర్శించారు. ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

భారత్‌లో ఏఐ 
ముఖేష్ అంబానీ ఏజీఎం సమావేశంలో భారత్‌ ఏఐలో రాణించేందుకు అవసరమైన వనరులు, నిబద్ధతను కలిగి ఉందని అన్నారు. జియో ప్లాట్‌ఫామ్‌లు ఏఐ మోడల్‌లు, ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసే ప్రయత్నానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాయి. తద్వారా దేశ పౌరులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి ఒకే విధంగా ప్రయోజనాన్ని అందిస్తాయని సూచించారు. 

ఏఐ డిమాండ్లను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందన్నారు. క్లౌడ్, ఎడ్జ్ లొకేషన్‌లు రెండింటినీ కలుపుతూ.. సుస్థిరత, పర్యావరణ బాధ్యత పట్ల నిబద్ధతను పాటిస్తూ 2000 ఎండబ్ల్యూ వరకు ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సృష్టించేందుకు రిలయన్స్‌ కట్టుబడి ఉందని ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు