వెయిట్‌ చేసినందుకు...ఎలాంటి కష్టం లేకుండా రూ. 1.35 కోట్ల జాక్‌పాట్‌ కొట్టేశారు..!

15 Feb, 2022 10:34 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్‌. స్టాక్‌ మార్కెట్‌పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షానే కురిపిస్తాయి. పెద్దపెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేసే బదులుగా మల్టీ బ్యాగర్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే తక్కువ సమయంలోనే భారీ లాభాలను అందిస్తాయని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు చెప్తుంటారు. తాజాగా మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఐనా దీపక్‌ నైట్రేట్‌ కంపెనీ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

గత కొద్ది రోజులుగా మల్టీ బ్యాగర్‌ స్టాక్‌ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెడుతున్నాయి. ప్రముఖ కెమికల్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ దీపక్‌ నైట్రేట్‌ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో 2010 అక్టోబర్‌లో లిస్టింగ్‌ అయ్యింది. ఆ సమయంలో స్టాక్‌ ధర రూ. 17.81 పైసలుగా ఉంది. గత పది ఏళ్లలో స్టాక్‌ విలువ భారీగా ఎగబాకింది. ప్రస్తుతం ఈ స్టాక్‌ షేర్‌ ధర రూ. 2013.45 చేరింది. ఈ స్టాక్‌ ధర ఒకానొక సమయంలో ఏకంగా రూ. 2897.80కు చేరుకుంది. కాగా పదేళ్ల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే...లక్షకు రూ. 1.35 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. షేర్‌ హోల్డర్లకు దాదాపు 1,900 శాతం రాబడిని అందించింది. సుమారు పదేళ్ల పాటు నిరీక్షించిన షేర్‌ హోల్లర్లకు దీపక్‌ నైట్రేట్‌ కాసుల వర్షాన్ని కురిపించింది. 

దీపక్‌ నైట్రేట్‌
దీపక్ నైట్రేట్ లిమిటెడ్ ఒక స్వదేశీ రసాయన తయారీ సంస్థ. దీని తయారీ కేంద్రాలు గుజరాత్‌లోని నందేసరి, దహేజ్, మహారాష్ట్రలోని రోహా, తలోజా, తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్నాయి. 2020లో కంపెనీ నికర ఆదాయం రూ. 611 కోట్లుగా ఉంది.దీపక్ ఫినోలిక్స్ లిమిటెడ్ , దీపక్ నైట్రేట్ కార్పొరేషన్ ఇంక్ , నోవా సింథటిక్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి.

చదవండి: యాక్సిస్ బ్యాంక్‌ చేతికి సిటీ బ్యాంక్ బిజినెస్‌‌‌‌

మరిన్ని వార్తలు