మరో సంచలన ప్రయోగానికి సిద్దమైన ఎలన్‌ మస్క్‌..!

14 Dec, 2021 15:00 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్‌ మస్క్‌ తన క్రేజీ చేష్టలతో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ఒక్కోసారి తను చేసే ట్విట్స్‌తో అందరినీ షాక్‌కి గురి చేస్తారు.. మరికొన్ని ట్విట్స్‌తో ఎంటర్టైన్ చేస్తారు. తాజాగా మరోసారి, ఎలన్‌ మస్క్‌ ఆసక్తికరమైన ఒక ట్వీట్ చేశారు. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.. "స్పేస్ ఎక్స్ వాతావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు తీసి రాకెట్ ఇంధనంగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఆసక్తి ఉంటే దయచేసి చేరండి. అంగారక గ్రహానికి కూడా ఇది ముఖ్యం" అని మస్క్ ట్వీట్ చేశారు.

ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్‌ మస్క్‌ టైమ్ మ్యాగజైన్ "2021 పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికచేయబడ్డారు.  అంతరిక్ష రవాణా ఖర్చులను తగ్గించి, అంగారక గ్రహాన్ని నివాస యోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ 2002లో స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించారు. మనుషులను అంతరిక్షంలోకి తసుకెళ్లడానికి స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌకను కూడా తయారు చేస్తోంది. అది అంగారక గ్రహం మీద స్థిరపడే ప్రక్రియను ప్రారంభిస్తుంది. స్టార్ షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌక 100 మెట్రిక్ టన్నులకు పైగా తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

(చదవండి: బిట్‌కాయిన్‌ గాలి తీసేసిన బిలియనీర్‌ కింగ్‌!)

మరిన్ని వార్తలు