ElonMusk ట్విటర్‌ డీల్‌: అమెరికా అధ్యక్షుడి మండిపాటు

5 Nov, 2022 12:29 IST|Sakshi

న్యూఢిల్లీ: బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌  కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. తప్పుడు సమాచారాన్ని అవాస్తలను వ్యాప్తి చేస్తున్న ట్విటర్‌ను కొనుగోలు చేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.  ప్రపంచవ్యాప్తంగా, అసత్య ప్రచారాలతో విషాన్ని చిమ్ముతున్న ట్విటర్‌ను  కొనుగోలు  చేశారని మండిపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా అసత్య వార్తలను, విషప్రచారాన్ని చేస్తున్న ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయడం విచారకరమన్నారు. ట్విటర్‌కి అసలుఎడిటర్లే (నియంత్రణ) లేరు ఇక ప్రమాదంలో ఉన్నదాన్ని పిల్లలు అర్థం చేసుకుంటారని ఎలా విశ్వసించాలని బిడెన్‌ ప్రశ్నించారు.  ముఖ్యంగా సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సహా పలువురి కీలక ఎగ్జిక్యూవ్‌ల తొలగింపు, సంస్థలో దాదాపు సగం ఉద్యోగులపై వేటు, డైరెక్టర్‌ బోర్డును చేసి, ఏకైక డైరెక్టర్‌గా మస్క్‌ కొనసాగుతున్న నేపథ్యంలో బిడెన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

నవంబర్ 8న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం చికాగోలో జరిగిన నిధుల సమీకరణ మీట్‌లో దీని ప్రభావంపై డోనర్లను హెచ్చరిస్తూ బిడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల మధ్య ఈ ఎ న్నికలు బైడెన్‌ సర్కార్‌కు పెద్ద సవాల్‌. (ElonMusk రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం! అయినా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నా!)

మరోవైపు ట్విటర్ టోకోవర్‌పై అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డోనాల్ట్‌ ట్రంప్‌  సానుకూలంగా స్పందించిన  సంగతి తెలిసిందే. కాగా బిడెన్‌పై మస్క్​ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు బైడెన్​ను ఎన్నుకోలేదనీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ డ్రామాను తట్టుకోలేకే ఆయన్ను గెలిపించారని వ్యాఖ్యానించడం గమనార్హం.

మరిన్ని వార్తలు