ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాభం అప్‌ 

9 Aug, 2021 00:20 IST|Sakshi

క్యూ1లో రూ. 979 కోట్లు 

కొచ్చి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 14 శాతం ఎగసి రూ. 979 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 858 కోట్లు మాత్రమే ఆర్జించింది. గోల్డ్‌లోన్‌ విభాగం నికర లాభం 16 శాతం వృద్ధితో రూ. 971 కోట్లను తాకింది. నిర్వహణలోని స్థూల రుణ ఆస్తులు(ఏయూఎం) 25 శాతం బలపడి రూ. 58,135 కోట్లకు చేరాయి.  మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 2,963 కోట్లకు చేరింది. 

మరిన్ని వార్తలు