హైదరాబాద్‌లో తిరుగులేని రికార్ట్‌! సింగిల్‌ డే 1,125 ఫ్లాట్స్‌ సేల్‌ రికార్డు సృష్టించిన సయూక్‌!

14 Jun, 2022 13:04 IST|Sakshi

ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోం అరుదైన ఫీట్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రియల్టీ సెక్టార్‌లో ఇంత వరకు ఏ సంస్థకు సాధ్యం కానీ రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ సంస్థ నూతనంగా ప్రారంభించిన మైహోం సయూక్‌ ప్రాజెక్ట్‌లో కనీవినీ ఎగురని స్థాయిలో బుకింగ్స్‌ జరిగాయి. అమ్మకాలు ఆరంభమైన 24 గంటల వ్యవధిలోనే 1,125 ప్లాట్స్‌ బుక్‌ అయ్యాయి. వీటి విలువ రూ.1800 కోట‍్లు ఉంటుందని మైహోం సంస్థ తెలిపింది.

తన రికార్డులు తానే
రియల్టీలో మైంహోంకి ప్రత్యేక స్థానం ఉంది. 2016లో ఈ గ్రూపు నుంచి మైహోం అవతార్‌ ప్రాజెక్టును ప్రారంభిచారు. ఆ రోజుల్లో కేవలం 24 గంటల్లోనే వెయ్యికి పైగా ప్లాట్స్‌ బుక్‌ అవడం రికార్డుగా నిలిచింది. గడిచిన ఆరేళ్లుగా ఇదే సింగిల్‌ డే హయ్యస్ట్‌ బుకింగ్స్‌ రికార్డుగా కొనసాగుతోంది. తాజాగా సయూక్‌ 1,125 బుక్సింగ్స్‌తో అవతార్‌ను అధిగమించింది. రియల్టీలో తాను నెలకొల్పిన రికార్డులను తానే బ్రేక్‌ చేసింది మైహోం. నమ్మకానికి మరో పేరైన హైహోం ప్రారంభించిన ప్రాజెక్టులో ప్లాట్లు సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీ పడటంతో ఈ రికార్డు సాధ్యమైంది.

లగ్జరీకి కొత్త నిర్వచనం
టీఎస్‌ రేరా నుంచి అన్ని అనుమతులు తీసుకుని మైహోం, ప్రతిమ గ్రూపులు సంయుక్తగా 25.37 ఎకరాల విస్తీర్ణంలో సయూక్‌ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ప్రీమియం లైఫ్‌స్టైల్‌ అపార్ట్‌మెంట్లను దశల వారీగా నిర్మిస్తూ టౌన్‌షిప్‌ స్థాయిలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్ట్‌ సయూక్‌లో 2 బీహెచ్‌కే, 2.5 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇవి 1355 చదరపు అడుగుల నుంచి 2262 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మాణం జరుపుకోబోతున్నాయి. మొత్తంగా 40 అంతస్థులతో నిర్మితమవుతున్న సయూక్‌లో లక్ష చదరపు అడుగుల క్లబ్‌ హౌజ్‌తో పాటు ఇతర లగ్జరీ సౌకర్యాలు కల్పించబోతున్నారు. మొత్తం 12 టవర్లలుగా నిర్మాణం జరుపుకుంటున్న సయూక్‌లో ప్రస్తుతం 6 టవర్లకు సంబంధించి బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఒక్కసారి ఈ ప్రాజెక్టు పూర్తయితే లగ్జరీ లివింగ్‌ విత్‌ వాక్‌ టూ వర్క్‌ కల్చర్‌కి సరికొత్త నిర్వచనం ఇవ్వగలదు.

వారి నమ్మకం వల్లే
కష్టమర్లకు మా మీద ఉన్న అంచంచలమైన నమ్మకానికి ప్రతిరూపమే ఈ రికార్డు స్థాయి బుకింగ్స్‌కి కారణమని మైహోం గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జూపల్లి శ్యామ్‌రావు అన్నారు. తొలి రోజు రికార్డు స్థాయి అమ్మకాల పట్ల సంతోషంగా ఉందని చెబుతూనే.. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన గడువులోగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలో నిర్మించిన ఇళ్లను కష్టమర్లకు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు శ్యామ్‌రావు. అదే విధంగా  మైహోం చైర్మన్‌ డాక్టర్‌ రామేశ్వర్‌రావు, ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్న ప్రతిమా గ్రూపు చైర్మన్‌  ఎం శ్రీనివాస్‌రావులతో పాటు మైహోం కస్టమర్లకు, ఎంతో శ్రమించి పని చేస్తున్న తమ సంస్థ ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. (అడ్వర్టోరియల్)

మరిన్ని వార్తలు