నాల్కో లాభం క్షీణత.. క్యూ3లో రూ. 256 కోట్లు

13 Feb, 2023 08:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 69 శాతం క్షీణించి రూ. 256 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 831 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,845 కోట్ల నుంచి రూ. 3,356 కోట్లకు వెనకడుగు వేసింది.

అల్యూమినా అమ్మకాలు తగ్గడం, అధిక ముడివ్యయాలు, ప్రపంచ అనిశ్చితులు లాభదాయకతను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. అయితే అల్యూమినియం ధరలు బలపడటం, ఉత్పత్తి పుంజుకోవడం కారణంగా రానున్న త్రైమాసికాలలో ఉత్తమ ఫలితాలను సాధించనున్నట్లు కంపెనీ సీఎండీ శ్రీధర్‌ పాత్ర అంచనా వేశారు.

మరిన్ని వార్తలు