నాల్కో హైజంప్‌

8 Feb, 2022 06:40 IST|Sakshi

 క్యూ3లో రూ. 831 కోట్లు

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం నేషనల్‌ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 831 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 240 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,415 కోట్ల నుంచి రూ. 3,845 కోట్లకు జంప్‌ చేసింది. తాజాగా వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇప్పటికే రూ. 2.50 డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే.  
ఫలితాల నేపథ్యంలో నాల్కో షేరు బీఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 119 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు