మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్‌ !

4 Sep, 2021 16:04 IST|Sakshi

మొఘల్‌ కిచెన్‌లో రూపుదిద్దుకుని నాన్‌ వెజ్‌ ప్రియులకు ఇప్పుడెంతో ఇష్టమైన ఆహారంగా మారింది బిర్యానీ. ఎప్పడికప్పుడు బిర్యానీలో వెరైటీలు పుట్టుకొస్తున్నా చికెన్‌ బిర్యానీనే రాజభోగం. అందులో లెగ్‌పీస్‌కే అగ్రాసనం. ఇప్పుడా లెగ్‌పీస్‌కి ఛాలెంజ్‌ ఎదురైంది. నగరంలో సరికొత్త ట్రెండ్‌గా నల్లిబిర్యానీకి డిమాండ్‌ పెరుగుతోంది.

ఊరూరా బిర్యానీ
ఒకప్పుడు హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేకం హైదరాబాద్‌ బిర్యానీ. కానీ దశాబ్ధ కాలంగా బిర్యానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా విస్తరించింది. జిల్లా కేంద్రాలను దాటి మున్సిపాలిటీలకు చేరుకుంది. రోడ్డు పక్కన చిన్న షెడ్డులో కూడా టేక్‌ ఎవే సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఇంతలా విస్తరిస్తున్నా ఎక్కడా బిర్యానీ క్రేజ్‌ తగ్గడం లేదు. పైగా కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. ముంబైలో బాగా ఫేమసైన నల్లి బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్‌ రెస్టారెంట్లలో హల్‌చల్‌ చేస్తోంది.

నల్లి బిర్యానీ
బిర్యానీలో రారాజుగా ఉన్న చికెన్‌ బిర్యానీ పోటీగా ఎదుగుతోంది నల్లి బిర్యాని. మటన్లో నల్లి బొక్కలతో ప్రత్యేకంగా ఈ వంటకాన్ని తయారు చేయడంతో దీన్ని నల్లిబిర్యానీగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బిర్యానీలో బాస్మతి రైస్‌, చికెన్‌ లేదా రైస్‌ను కలిపి వండుతారు. అయితే నల్లి బిర్యానీలో రైస్‌, నల్లి బొక్కలను వేర్వేరుగా వండుతారు. ఆ తర్వాత వీటిని కలిపి నల్లి బిర్యానీగా సర్వ్‌ చేస్తారు. మటన్‌లో ప్రత్యేక రుచిని కలిగి ఉండే నల్లి ఎముకలకు బిర్యానీ రెసీపీ తోడవడటంతో నల్లి బిర్యానీని లొట్టలెసుకుని తింటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

పెరిగిన డిమాండ్‌
హైదరాబాద్‌ నగరంలో నల్లి బిర్యానీ ట్రెండ్‌ క్రమంగా విస్తరిస్తోంది. బిర్యానీ ప్రియుల నుంచి డిమాండ్‌ ఎక​‍్కువగా ఉండటంతో క్రమంగా నల్లి బిర్యానీ అందిస్తున్న రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య పెరుగుతోంది. ముందుగా బంజార్‌హిల్స్‌, మసాబ్‌ట్యాంక్‌ దగ్గర రెస్టారెంట్లలో మొదలైన నల్లి బిర్యానీ ప్రస్థానం క్రమంగా హైదరాబాద్‌ నలుమూలలకు విస్తరిస్తోంది. సాధారణ బిర్యానీతో పోల్చితే రేటు నల్లి బిర్యానీ రేటు ఎక్కువ. అయినా సరే రేటు కంటే రుచే ముఖ్యం అంటూ నల్లిబిర్యానీకి షిఫ్ట్‌ అవుతున్నారు. నల్లి బిర్యానీ వండే చెఫ్‌లకు ప్రాముఖ్యత పెరిగిపోతుంది.

చదవండి : అఫ్గన్‌ సంక్షోభం.. ఇలాగైతే బిర్యానీ రేట్లు పెరిగే ఛాన్స్‌!

మరిన్ని వార్తలు