ఢిల్లీ రావాలంటేనే ఇబ్బందిగా ఉంది ఇన్ఫీ నారాయణమూర్తి: అసలేమైంది?

22 Feb, 2023 10:48 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌  వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ న‌గ‌రంపై చ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ఢిల్లీలో  నిబంధనల ఉల్లంఘనలపై స్పందించిన ఆయన ఢిల్లీకి రావాలంటే ఇబ్బందిగా ఉందంటూ అసహనానికి గురయ్యారు. క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యానికి ఢిల్లీ ప‌రాకాష్ట‌, క్ర‌మ‌శిక్ష‌ణ  పాటించకుండా, ట్రాఫిక్‌  నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైనంపై ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయితే తాను ఏ వ్యక్తిని ద్వేషించనని, కానీ వారి  చర్యల్ని మాత్రమే  ద్వేషిస్తానని మూర్తి అన్నారు.

ఎయిర్‌పోర్ట్ నుంచి వ‌స్తుండగా, ఒక చౌర‌స్తా వ‌ద్ద రెడ్ సిగ్న‌ల్ ప‌డింది.  కార్లు, మోటార్ బైక్‌లు, స్కూట‌ర్‌ల‌ వాహనాలదారులు  ఏమాత్రం జాగ్ర‌త్త‌ తీసుకోకుండా రెడ్‌లైట్ ఉన్నాసరే దూసుకెళ్లిపోతున్నారంటూ ఇన్ఫీ మూర్తి  చిరాకుపడ్డారు.  ముందు కెళ్లడానికి రెండు నిమిషాలు ఓపిక పట్టలేకపోతే.. ఇక మ‌నీ ఉంటేఆగుతారా? ఆఫ్‌కోర్స్‌  వేచి ఉండ‌రని పేర్కొన్నారు. నిజానికి వ్య‌క్తిగ‌త ఆస్తుల‌కంటే స‌మాజ ఆస్తుల‌ను మెరుగ్గా కాపాడుకోవాల్సి ఉంద‌న్నారు. కార్పొరేట్ ప్ర‌పంచంలో విలువ‌ల ప‌రిర‌క్ష‌ణ‌ గురించి కూడా మాట్లాడారు. మంగ‌ళ‌వారం ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేష‌న్ (ఏఐఎంఏ) వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగానారాయ‌ణ‌మూర్తి ఈ వ్యాఖ్య‌లు  చేశారు.  అలాగే చాట్‌జీపీటీ, ఏఐ టెక్నాలజీపై తన అభిప్రాయాలను వెల్లడించారు. 

చాట్‌ జీపీటీ గురించి ఏమన్నారంటే..
చాట్‌జీపీటీ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ, సైన్స్ అనేది ప్రకృతిని బహిర్గతం చేస్తుంది. టెక్నాలజీ మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి, ఉత్పాదకతను మెరుగుపర్చేందుకు, ఖర్చులను తగ్గించడానికి, ఇతర సమస్యల పరిష్కారానికి సైన్స్ టెక్నాలజీ, పవర్‌ను ఉపయోగిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి  జీవితాన్ని  సౌకర్యవంతంగా మారుస్తుంది అంతే తప్ప మానవ మేథస్సును భర్తీ చేస్తుందనుకోవడం తప్పుడు విశ్వాసమన్నారు. మనిషికి ఎందుకంటే విచక్షణా జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని అధిగమిస్తున్న కృత్రిమ మేధస్సును మనిషి అనుమతించడు.  ఇప్పటివరకూ ఎన్నో ప్రయోగాలు చేసినా,  ఈ ప్రపంచంలో చిన్న పిల్లల మనస్సుకు సరితూగే కంప్యూటర్‌ ఉందా అసలు. టెక్నాలజీ పాలిట మాన్‌స్టర్‌లా మనిషి ఎపుడూ ఒక అడుగు ముందే ఉంటాడు అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు