పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామం

18 Nov, 2020 05:15 IST|Sakshi

బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత్‌ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశమని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పేర్కొన్నారు. పట్టణీకరణ, రవాణా, ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి మరింత ఆకర్షణీయ దేశంగా భారత్‌ ఉందని ఆయన అన్నారు. బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌ను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 

► భారత్, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలు రానున్న రెండు దశాబ్దాల్లో భారీ పట్టణీకరణ విప్లవాన్ని చూడనున్నాయి. పట్టణీకరణలోకి పరివర్తన చెందే క్రమంలో భారత్‌ ముందడుగు వేస్తోంది.  
► కరోనా మహమ్మారి సవాళ్లు సమసిపోయిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు తిరిగి మెరుగుపడే స్థాయిలో ప్రపంచ పునరి్నర్మాణం జరగాలి. ప్రజల ఆలోచనా ధోరణి, విధానాలు సంబంధిత ప్రక్రియలో నవీనత లేకపోతే, కోవిడ్‌ తదుపరి వ్యవస్థను పునఃప్రారంభించలేము. ముఖ్యంగా డిజిటలైజేషన్‌ విధానానికి మరింత ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది.  
► 2022 గడువుకు కోటి చౌక గృహాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యానికి  కేంద్రం కట్టుబడి ఉంది.  
► 100 స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి దాదాపు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రూ.1.4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి కావడమో లేక పూర్తికాబోతున్న దశకు చేరడమో జరుగుతోంది.  
► పట్టణీకరణలో పెట్టుబడులకు మీరు చూస్తున్నట్లయితే, భారత్‌ మంచి అవకాశాలను మీకు కలి్పస్తుంది. రవాణా,  ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల విషయంలోనూ మీకు భారత్‌ ఇదే రకమైన అవకాశాలను అందిస్తుంది.  

మరిన్ని వార్తలు