జపాన్‌లో బిజిబిజీగా ప్రధాని మోదీ.. భారత్‌ సామర్థ్యాన్ని వివరిస్తూ పెట్టుబడులకు ఆహ్వానం

23 May, 2022 13:26 IST|Sakshi

Narendra Modi Japan Tour: భారతదేశాన్ని ఆధునికీరించే సంస్కరణలను ప్రధాని మోదీ తీసుకువస్తున్నారు. పిఎం మోదీ స్వయం-విశ్వాస దీక్షకు జపాన్ కంపెనీలు గట్టిగా మద్దతు ఇస్తున్నాయి అని సుజుకీ మోటర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ప్రెసిడెంట్‌ తోషిహిరో సుజుకీ పేర్కొన్నారు.

క్వాడ్‌ సదస్సు, ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా..  భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి వరుసభేటీలు అవుతున్నారు. ముందుగా నోబుహిరో ఎండోతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. జపానీస్‌ మల్టీనేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎలక్ట్రిక్‌ దిగ్గజం ఎన్‌ఈసీ కార్పొరేషన్‌కు హెడ్‌ ఆయన. 

భారతదేశ సంస్కరణల పథాన్ని హైలైట్ చేస్తూ.. డిజిటల్ లెర్నింగ్, ఫిన్‌టెక్, ఇన్‌ఫ్రా మరియు లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ల వంటి రంగాలలో అవకాశాల గురించి ఆయన మాట్లాడారు అంటూ ప్రధాని కార్యాలయం ట్విటర్‌ హ్యాండిల్‌ వివరాలను పోస్ట్‌ చేసింది. అదే విధంగా భారత్‌లో టెలికమ్యూనికేషన్‌ సెక్టార్‌లో ఎన్ఈ‌సీ అందిస్తున్న సేవలకు.. ప్రత్యేకించి చెన్నై-అండమాన్‌ నికొబార్‌లో, కొచ్చి-లక్షద్వీప్ ప్రాజెక్టులపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు.


యునిక్‌లో చైర్మన్‌.. సీఈవో తడాషి యానైతోనూ మోదీ భేటీ అయ్యారు. టెక్స్‌టైల్స్ తయారీ కేంద్రంగా, ప్రత్యేకించి టెక్స్‌టైల్ తయారీలో సాంకేతికతలను ఉపయోగించుకునే దిశగా భారతదేశ ప్రయాణంలో  మెరుగైన భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి యునిక్‌లో సానుకూలంగా స్పందించింది. 

భారతదేశంలో ఉత్పత్తి & రిటైల్ పరిశ్రమలో ఎలా పెట్టుబడి పెట్టాలనే దాని గురించి మేము చర్చించాం. ప్లాంట్ నుండి డిజైన్ నుండి ఫాబ్రిక్ వరకు ఎండ్-టు-ఎండ్ ఉత్పత్తులపై దృష్టి సారించగలం. భారతదేశంలో భారత ఐటీ ప్రతిభ అద్భుతమైనది. కాబట్టి, సానుకూలంగానే మేం ప్రధాని మోదీకి సమ్మతిని తెలిపాం అని యునిక్‌లో చైర్మన్‌.. సీఈవో తడాషి యానై వెల్లడించారు.

మరిన్ని వార్తలు