Jeff Bezos: జెఫ్‌బెజోస్‌ దెబ్బకు దిగివచ్చిన నాసా..!

15 Sep, 2021 19:43 IST|Sakshi

వాషింగ్టన్‌:  జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ నాసా మూన్‌ ల్యాండర్‌ కాంట్రాక్ట్‌ విషయంలో యూఎస్‌ ప్రభుత్వంపై దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాసాపై పోరాడేందుకు కూడా బ్లూ ఆరిజిన్‌ సిద్ధమైంది. బ్లూ ఆరిజిన్‌ యూఎస్‌ కోర్టులో దావాలను దాఖలు చేయడంతో నాసా ఏకపక్ష నిర్ణయాలపై వెనకడుగు వేసింది. బ్లూ ఆరిజిన్‌ దెబ్బకు నాసా చంద్రుడిపై ప్రయోగించనున్న మూన్‌ ల్యాండింగ్‌ మిషన్‌ డిజైన్‌ కాంట్రాక్ట్‌ను ఒకే సంస్థకు ఇవ్వకుండా పలు కంపెనీలకు నాసా అందజేసింది. బ్లూ ఆరిజిన్‌ సంస్థ నాసాపై దావాలను దాఖలు చేయడంతో పలు కంపెనీలకు ల్యాండింగ్‌ మిషన్‌ డిజైన్‌ కాంట్రాక్టులను అందించినట్లు నిపుణులు భావిస్తున్నారు.    

చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్‌ మస్క్‌ వాదనతో ఏకీభవించిన ఆనంద్‌ మహీంద్రా..!

డిజైన్‌ కాంట్రాక్టు పలు కంపెనీలకు...
మానవసహిత మూన్‌ ల్యాండర్‌ మిషన్‌ కోసం 2024లో  నాసా ఆర్టిమిస్‌ ప్రోగ్రాం చేపట్టనుంది. మానవ సహిత మూన్‌ ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలనే లక్ష్యంతో మూన్‌ ల్యాండింగ్‌ డిజైన్‌కు సంబంధించిన ఒప్పందాలను ఐదు కంపెనీలకు నాసా అందజేసింది.  ఐదు కంపెనీల్లో బ్లూ ఆరిజిన్‌, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు కూడా ఉన్నాయి. ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ సుమారు 9.4 మిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ దక్కగా..జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ సుమారు 25.6 మిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ కంపెనీలు స్థిరమైన ల్యాండింగ్ డిజైన్లను రూపోందించనున్నాయి.  ఆర్టిమిస్‌ మిషన్‌లో భాగంగా మొత్తంగా 146 మిలియన్‌ డాలర్లను మూన్‌ ల్యాండింగ్‌ డిజైన్లను అభివృద్ధి చేయడం కోసం డైనటిక్స్‌ సంస్ధకు 40.8 మిలియన్‌ డాలర్లు, లాక్‌హీడ్‌మార్టిన్‌ సంస్థకు 35.2 మిలియన్‌ డాలర్లు, నార్త్రోప్ గ్రుమ్మన్ సంస్థకు 34.8 మిలియన్‌ డాలర్ల ఒప్పందాలను అందజేసింది. ఈ ప్రాజెక్టు సుమారు 15 నెలల పాటు కొనసాగనుంది. 

విచారణ అక్టోబర్‌ 14 న...
నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్‌ కోర్టు మెట్లను ఎక్కింది. నాసా చంద్రుడిపై హ్యూమన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా అక్వసిషన్‌ ప్రాసెస్‌లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని బ్లూ ఆరిజిన్‌ సంస్థ కోర్టుకు వెళ్లగా,  దీనిపై యూఎస్‌ ఫెడరల్‌ కోర్టు అక్టోబర్‌ 14న విచారించనుంది.
చదవండి: Elon Musk : ఫోటో షేర్‌ చేశాడో లేదో...! ఒక్కసారిగా పెరిగిన కరెన్సీ విలువ...!

మరిన్ని వార్తలు