మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా

11 Jan, 2021 20:27 IST|Sakshi

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. 2021 జనవరి 17న శక్తివంతమైన ఎస్‌ఎల్‌ఎస్ రాకెట్ ను నాసా పరీక్షించనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే వాణిజ్యేతర మానవ అంతరిక్ష ప్రయాణానికి మార్గం సుమగం కానుంది. ఇప్పటికే ఈ స్పేస్ లాంచ్ సిస్టమ్ ప్రయోగం జరగాల్సినప్పటికీ అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ రాకెట్ ప్రయోగాన్ని ఆర్టెమిస్ స్సేస్ ప్రోగ్రామ్ కు కొనసాగింపుగా చేపట్టనుంది నాసా. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒక మహిళను, పురుషుడిని చంద్రునిపైకి తీసుకెళ్లడానికి మార్గం సుగమం కానుంది. (చదవండి: కలప ఉపగ్రహం.. ఎందుకంటే?)

ఆర్టెమిస్ స్సేస్ ప్రోగ్రామ్ లో భాగంగా 2024లో చంద్రునిపైకి మొదటి సారిగా మహిళను తీసుకుపోనున్నారు. అలాగే, 2030 నాటికీ మానవులను అంగారక గ్రహంపైకి తీసుకువెళ్లనున్నారు. చివరి ఎనిమిది దశ పరీక్షలో భాగంగా రాకెట్ ను జనవరి 17న పరీక్షించనున్నారు. ఏడవ దశను 2020 డిసెంబర్ 20న విజయవంతంగా పరీక్షించారు. జనవరి 9న నాసా భారీ స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్‌ఎల్‌ఎస్) రాకెట్ కు 'గ్రీన్ రన్ హాట్ ఫైర్ పరీక్ష'ను నిర్వహించింది. ఈ రాకెట్ లో ద్రవ ఇంధన ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లు అనే రెండు ప్రధాన భాగాలను జోడించింది. ఈ చివరి దశ మిస్సిస్సిప్పిలోని బే సెయింట్ లూయిస్ సమీపంలోని నాసా స్టెనిస్ అంతరిక్ష కేంద్రంలో పరీక్షించనున్నట్లు నాసా స్పష్టం చేసింది. ఏడవ దశలో ఈ రాకెట్ ను పరీక్షించినప్పుడు 265,000 లీటర్లు సూపర్ కూల్డ్ ద్రవ ఇంధనాన్ని, 27 టన్నుల గల బరువును ఎస్‌ఎల్‌ఎస్ రవాణా చేస్తుందని నాసా అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ రాకెట్ పొడవు 322 అడుగులు ఉండనున్నట్లు నాసా పేర్కొంది. 

మరిన్ని వార్తలు