-

Elon Musk-Jeff Bezos: ఎలన్‌ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్‌...!

21 Aug, 2021 15:21 IST|Sakshi

వాషింగ్టన్‌:  అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ తన ప్రత్యర్థి బిలియనీర్‌, స్పేస్‌ ఎక్స్‌, టెస్లా కంపెనీల అధినేత ఎలన్‌ మస్క్‌కు భారీ దెబ్బె కొట్టాడు. జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ నాసా మూన్‌ ల్యాండర్‌ కాంట్రాక్ట్‌ విషయంలో యూఎస్‌ ప్రభుత్వంపై దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్‌ కోర్టు మెట్లను ఎక్కింది. నాసా చంద్రుడిపై హ్యూమన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా అక్వసిషన్‌ ప్రాసెస్‌లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని బ్లూ ఆరిజిన్‌ సంస్థ కోర్టుకు వెళ్లింది.

(చదవండి: Elon Musk: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్‌ మస్క్‌...!)


చివరికి జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ తన పంతం నెగ్గించుకుంది. నాసా తీసుకున్న ఏకపక్షనిర్ణయంపై యూఎస్‌ కోర్టు అక్టోబర్‌ 14న ​కేసును విచారించనుంది. దీంతో ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌కు అప్పగించిన మ్యూన్‌ ల్యాండర్‌ కాంట్రాక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేయడానికి నాసా అంగీకరించిందని గురువారం నాసా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మ్యూన్‌ ల్యాండర్‌ మిషన్‌లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు సుమారు 2.9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 21,587 కోట్లు) కాంట్రాక్ట్‌ను నాసా ఆఫర్‌ చేసింది. మ్యూన్‌ ల్యాండర్‌ మిషన్‌ ల్యాండర్‌ కోసం స్పేస్‌ఎక్స్‌, నాసా ఇరు పక్షాలు చేస్తోన్న పనులను ఈ ఏడాది నవంబర్‌ 1 వరకు తాత్కాలికంగా నిలిపివేయడానికి ఒప్పుకున్నాయి.

ఇదిఇలా ఉండగా.. గత నెలలో యూఎస్‌ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (జీఎఓ) బ్లూ ఆరిజిన్ ఎత్తి చూపిన అంశాన్ని తిరస్కరిస్తూ నాసాకు తన మద్దతును తెలిపింది. కాగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్లూ ఆరిజిన్‌ సంస్థ కోర్టుకు వెళ్లింది. నాసా తీసుకున్న ఏకపక్షనిర్ణయంలో ప్రాథమిక సమస్యలు ఉన్నాయని, తమ పరిమిత అధికార పరిధి కారణంగా జీఎఓ వాటిని పరిష్కరించలేకపోయిందని బ్లూ ఆరిజిన్‌ సంస్థ పేర్కొంది. బ్లూ ఆరిజిన్‌ సంస్థ ఈ మిషన్‌ కోసం నాసాకు భారీ మొత్తాన్ని కూడా ఆఫర్‌ చేసింది.

తాజాగా కోర్టు తీసుకున్న నిర్ణయంపై స్పేస్‌ ఎక్స్‌ ఇంకా స్పందించలేదు.  1972 తరువాత  నాసా ఆర్టెమిస్‌ మిషన్‌లో భాగంగా మరోసారి మానవులను చంద్రుడిపైకి తీసుకుళ్లే పనిలో భాగంగా అంతరిక్ష నౌక కోసం ప్రతిపాదనలు కోరింది. నాసా మ్యూన్‌ ల్యాండర్‌ మిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పేస్‌ ఎక్స్‌ దక్కించుకుంది. స్పేస్‌ ఎక్స్‌ 2024 లోపు మ్యూన్‌ లాండింగ్‌ రాకెట్‌ను రెడీచేయనుంది.

(చదవండి: ఎలన్‌ మస్క్‌ కొత్త ప్లాన్‌.. ఈసారి అంతరిక్షంలో ఏకంగా..!)

మరిన్ని వార్తలు