మార్స్‌ పై రోవర్‌ నిజంగానే సెల్ఫీ తీసుకుందా..!

26 Jun, 2021 17:11 IST|Sakshi

మామూలుగా సెల్ఫీ తీసుకునేటప్పుడు మనలో చాలా మంది సెల్ఫీ స్టిక్‌ లేదా మనలో ఎవరైనా పొడుగ్గా ఉన్నవారిని ఉపయోగించి సెల్ఫీను తీసుకుంటాం. మనం సెల్ఫీ తీసుకున్నట్లుగా ఫోటోను చూసి ఇట్టే చెప్పవచ్చును ఆ ఫోటో సెల్ఫీ ...! లేదా ఎవరైనా తీశారా..!  గత కొన్ని రోజుల క్రితం మార్స్‌ ఉపరితలంపై పర్సివర్సెన్స్‌ రోవర్‌ తీసుకున్న సెల్ఫీ  ఫోటోను  ఏప్రిల్‌ 6 నాసా విడుదల చేసింది. కాగా ఈ ఫోటోపై చాలా మందికి అనుమానాలు రేకెత్తాయి. ఫోటోను ఎవరో తీశారనే సందేహాలు వ్యక్త పరిచారు. కాగా తాజాగా పర్సివర్సెన్స్‌ తీసుకున్న సెల్ఫీ ఫోటోపై నాసా వివరణ ఇచ్చింది.   

నాసా వివరణ:
అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టడానికి ‘పర్సవరెన్స్‌’రోవర్‌ను నాసా పంపిన విషయం తెలిసిందే. పర్సవరెన్స్‌ రోవర్‌  ప్రాజెక్టులో భాగంగా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను కూడా పంపారు. మార్స్‌ఉపరితలంపై పర్సీవరెన్స్‌ రోవర్‌తో కలిసి హెలికాప్టర్‌ ఇన్‌జెన్యూటీని ఏప్రిల్‌ 6న సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీను తీసుకోవడానికి వాట్సాన్‌ అనే కెమెరానుపయోగించింది.  పర్సివరెన్స్‌ రోవర్‌కు అమర్చిన రోబోటిక్‌ ఆర్మ్‌తో వాట్సాన్‌ కెమెరాను ఉపయోగించి సెల్ఫీ  తీసింది.

కెమెరాతో తీసిన సుమారు 62  వ్యక్తిగత చిత్రాలను జోడించి పర్సివరెన్స్‌,  ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ల పూర్తి సెల్ఫీ చిత్రాన్ని విడుదల చేసింది. కాగా చిత్రాల జోడింపునకు సంబంధించిన వీడియోను నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ విడుదల  చేసింది. వ్యక్తిగతంగా తీసుకున్న చిత్రాలను కలిపి పూర్తి  చిత్రాన్ని విడుదల చేశామని నాసా పేర్కొంది.

చదవండి: నాసా సాధించిన మరో ఘన విజయం..మార్స్‌పై తొలిసారిగా..

మరిన్ని వార్తలు