'దేవుని చేయి' చిత్రాన్ని పోస్ట్ చేసిన నాసా

29 Sep, 2021 21:11 IST|Sakshi

ఈ అంతరిక్షం ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది. దీని అందం అసమానమైనది. కొన్నిసార్లు అంతరిక్షంలో జరిగే సంఘటనలతో మనం ఆశ్చర్యపోతుంటాం. తాజాగా అలాంటి సంఘటన మరోసారి అంతరిక్షంలో చోటు చేసుకుంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇటీవల ఒక చిత్రాన్ని షేర్ చేసింది. దాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా షేర్ చేసిన ఈ చిత్రానికి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ అని పేరు పెట్టింది. ఈ చిత్రాన్ని వేలాది మంది లైక్ చేస్తున్నారు. 

ఈ ఫోటో ఒక చేతిని పోలి ఉంది. చేతి వేళ్ళ మధ్యలో ఎలాగైతే కొంచెం ఖాళీ స్థలం ఉంటుందో అలాగే ఈ ఫోటోలో నలుపుగా ఉండి మిగతా మొత్తం బంగారు వర్ణంలో కనిపిస్తుంది. ఇది నిజంగానే 'దేవుని చేయి' లేదా మరేదైనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నక్షత్రంలోంచి పుట్టుకొచ్చినట్టున్న ఈ చేయి ఆకారానికి ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా పిలుస్తున్నారు. ఒక అత్యున్నత శక్తి ఆశీర్వాదాలను ఇస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. బాహ్య అంతరిక్ష సౌందర్యాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ బంగారు నిర్మాణం అయస్కాంతీకరణ శక్తి వల్ల విడుదలయ్యే శక్తి కణాలతో కూడిన నిహారిక అని నాసా తెలిపింది. ఒక నక్షత్రం పేలిన తర్వాత ఇలాంటి పల్సర్‌లు మిగిలిపోతాయి.(చదవండి: ఎస్‌బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్!)

A post shared by NASA Chandra X-ray Observatory (@nasachandraxray)

ఈ పల్సర్‌ను పిఎస్ఆర్ బి1509-58 అని పిలుస్తారు. ఇది 19 కిలోమీటర్ల పరిది వరకు విస్తరించి ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇది సెకనుకు 7 సార్లు తన చుట్టూ తిరుగుతోంది. ఇది భూమికి 17,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నెటిజన్లు ఈ చిత్రాలను చూసి ఆశ్చర్యపడుతున్నారు. "దీనిని "మిడాస్ చేయి" అని పిలవాలి!" అని ఒక వినియోగదారుడు కామెంట్ చేస్తే, మరొకరు "నాకు ఇది శివుడి మూడవ కంటి నుండి అగ్నిలా కనిపిస్తుంది, అతని చెవిరింగు అతని కేశాలంకరణలో ఉన్న గంగా లాగా" కనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. మీరు ఏమని భావిస్తున్నారో క్రింద కామెంట్ చేయండి.

మరిన్ని వార్తలు