మారుతీ సుజుకీకి ఎన్‌సీఎల్‌ఏటీలో ఊరట!

23 Nov, 2021 02:50 IST|Sakshi

సీసీఐ 200 కోట్ల జరిమానాపై స్టే

న్యూఢిల్లీ: ఆటో దిగ్గజ సంస్థ– మారుతీ సుజుకీపై కాంపిటీషన్‌ కమిషన్‌ విధించిన రూ. 200 కోట్ల జరిమానాపై అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఏఎల్‌టీ సోమవారం స్టే విధించింది. అయితే జరిమానా మొత్తంలో 10 శాతం (రూ.20 కోట్లు) మూడు వారాల్లోగా డిపాజిట్‌ చేయాలని కార్ల తయారీ సంస్థను ఆదేశించింది. ఇదే షరతుగా కారు తయారీదారుకు అక్టోబర్‌ 27న జారీ చేసిన డిమాండ్‌ నోటీసుపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్టే విధించింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్‌ 15వ తేదీకి వాయిదా వేసింది. డీలర్ల కార్ల అమ్మకం ధర విషయంలో కంపెనీ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందన్నది మారుతీ సుజుకీపై ఆరోపణ. దీనిని సమర్థిస్తూ, ఆగస్టు 23న కాంపిటేటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) కంపెనీపై రూ.200 కోట్ల జరిమానా విధించింది. దీనిని సవాలు చేస్తూ మారుతీ సుజుకీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.

మరిన్ని వార్తలు